[dropcap]ప్ర[/dropcap]కృతి విపత్తులను
తట్టుకుంటూ
కరవు వైపరీత్యాలను
అధిగమిస్తూ
శ్రమైక దోపిడీకి
బలి అవుతూ
శరీర కష్టాలకు
నలిగిపోతూ
నిత్యం జీవన్మరణ
పోరాటం సాగిస్తున్న
వలస గుండెకు
దెబ్బ మీద దెబ్బ
కరోనా విలయ తాండవం
అయినా..
కడుపు చేత పట్టుకుని
కుటుంబ బాధ్యలను
భుజాన వేసుకుని
బంధాలను కాళ్ళకు కట్టుకుని
క్షుద్బాధను తీర్చుకోడానికి
ఉదయించే సూర్యుడిలా
బ్రతుకు పోరాటానికి
సమాయత్తమైయ్యాడు
వలస కూలీ…