[dropcap]’నా[/dropcap] ఆటోగ్రాఫ్’ అనే చిత్రంలోని “మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది…” అనే పాటకు పేరడీ పాట అందిస్తున్నారు ఎ.బి.వి. నాగేశ్వర రావు.
~ ~
పల్లవి:
సౌమ్యముగానే సాగమనీ చిఱుగాలి సోకి చెబుతుంది
సాగిన కొద్దీ సోయగమను గిలిగింత అందులో ఉంది
సౌమ్యముగానే సాగమనీ చిఱుగాలి సోకి చెబుతుంది
సాగిన కొద్దీ సోయగమను గిలిగింత అందులో ఉంది
ఏఱు ఆవలించిన చోటే ఉదకము ఉబికి వస్తుంది
ఎదురుగాలి వీచిన చోటే ఆమతి అమితమౌతుంది
సౌమ్యముగానే సాగమనీ చిఱుగాలి సోకి చెబుతుంది
సాగిన కొద్దీ సోయగమను గిలిగింత అందులో ఉంది
ఏఱు ఆవలించిన చోటే ఉదకము ఉబికి వస్తుంది
ఎదురుగాలి వీచిన చోటే ఆమతి అమితమౌతుంది
చరణం 1:
పుడమి కష్టాల కొలిమి అనీ కంగుతినకు జీవితమా
కొలిమి తపన మరి అదిరే ఆకృతి తెచ్చుటకు గా
తీరమెక్కడో తోచుటలేదనీ కుమిలిపోకు జీవితమా
కెరటాల నిరంతర ఆరాటం తీరము చూపుటకు గా
అన్నప్రాశనమున మెతుకు నములుట గగనమే అయ్యింది
అనుదినము ఆగని ఆగమే అమ్మ ఓర్మికి తలవంచిందీ
దినదినము క్రొత్త రుచికి అభిరుచి ఆరాటపడిందీ
మార్పుకు ముందుంటేనే అభివృద్ధి అందిపుచ్చుకొనేదీ
సహేతుకతలోని శాస్త్రీయమిదీ అలవరచుకోనే తరమిదీ
సౌమ్యముగానే సాగమనీ చిఱుగాలి సోకి చెబుతుంది
సాగిన కొద్దీ సోయగమను గిలిగింత అందులో ఉంది
చరణం 2:
కనుల తీరు కాంచగా దోబూచులాట మానుకో
నిజానిజాల ఇజాలను తర్కించుకో
కాలానికి కళంకం ఆపాదించుట మానుకో
ప్రకృతి చందంగా ఉచ్ఛ లక్ష్యం కూర్చుకో
అమరినట్లుగా అంతరంగమే ఉచితం సూచిస్తుందీ
అమోఘముగా నీ ఉనికిని నువ్వే విరచించాలీ
నీ వైనాన్ని హర్షించి కాలమే మోకరిల్లగా
నీ పటిమకు బారుకట్టి విజయాలే వరియించగా
నీ ప్రాభవానికి భవిత బహుధా జైకొట్టాలీ
జగతిన స్ఫూర్తికి తలమానికం నువ్వే కావాలీ
సౌమ్యముగానే సాగమనీ చిఱుగాలి సోకి చెబుతుంది
సాగిన కొద్దీ సోయగమను గిలిగింత అందులో ఉంది
ఏఱు ఆవలించిన చోటే ఉదకము ఉబికి వస్తుంది
ఎదురుగాలి వీచిన చోటే ఆమతి అమితమౌతుంది