[dropcap]ఈ[/dropcap] వారం చూసిన ఓ లఘు చిత్రం “వీసా”. అదొక కన్సలేట్ ఆఫీసు. అమెరికన్ కావచ్చు. మరో దేశం కావచ్చు. లాబీలో మూడు కుర్చీల వరుస వుంది. అటు చివర, ఇటు చివరా సలీం (ఇషాన్ ఏ ఖన్నా), తేజస్విని (శ్వేతా బాసు ప్రసాద్) లు కూర్చుని వున్నారు. వారి ఎదుట రెసెప్షన్ డెస్క్ వుండాలి. కెమెరా ఆ డెస్కు నుంచి వీళ్ళను చూస్తోంది. ఇంటి దగ్గర ఏడేళ్ళ పాప జాస్మిన్ (డెలిసా మెహరా) ను వదిలి వచ్చారు. సలీం లేచి ఆ లేడీ ఆఫీసర్ ముందు నిలబడతాడు. ఇది నాలుగోసారి బహుశా రావడం. ఆమె అంటుంది అత్యవసర కేసులు తప్ప మేము మరే కేసులూ చూడట్లేదు, మీరు ఇలా మాటిమాటికి వచ్చి ప్రయోజనం లేదు. నా కూతురికి కేన్సర్ వుంది, ఈ దేశంలో దానికి ట్రీట్ చేసే వైద్యులు లేరు, ఇంతకంటే ఎమర్గెన్సి ఏముంటుంది అంటాడు. ఒక్క సారి నా ఫైల్ చూడండి నమ్మకం లేకపోతే అని ఫైల్ ఇస్తాడు. ఆమె పేజీలు తిరగేస్తూ వుంటే ఓ పది రూపాయల నోటు కనిపిస్తుంది. ఒకసారి తలెత్తి అతన్ని చూస్తుంది. ఇప్పుడే వస్తానంటూ వెళ్తుంది. తిరిగి వచ్చి అవసరమైన డాక్యుమెంట్లు, మెడికల్ సెర్టిఫికేట్లు వగైరా తీసుకుని మరుసటి వారం రమ్మంటుంది.
ఇంటి దగ్గర జాస్మిన్ అద్దం ముందు నిలబది తయారవుతోంది. తేజస్విని నువ్వు చదువు నిర్లక్ష్యం చేస్తున్నావు, చూసుకో మీ నాన్న చెప చెళ్ళుమనిపిస్తాడు అంటుంది. నాకు చెంపదెబ్బలతో భయం లేదు, ప్రేమకు గాని అంటుంది. ఇది దబంగ్ అనే చిత్రంలోని డైలాగ్. అమ్మాయికి నటన అంటే ఆసక్తి, వచ్చు కూడాను. ఇంతలో సలీం వస్తాడు. భార్యా భర్తలు కూచుని మాట్లాడుకుంటారు. సలీం ఒక పోలీసు అఫీసర్ అయినా అతని ఇంటి మీద కూడా సమీప పక్షంలో మూడు సారులు దాడులు జరిగాయి. భార్య హిందువాయె. వూరంతా ఇలాంటి ఉపద్రవాలే. భార్యకు కంటికి కునుకు వుండదు, నిద్ర పోగలిగితే అన్నీ పీడ కలలే. వూరొదిలి వెళ్ళిపోదామని ఆలోచన. తన బంగారం, ఇల్లూ అమ్మేయమంటుంది. మనం తిరిగి వస్తే ఇల్లంటూ వుండొద్దా అంటే, మనం అసలు ఇక్కడికి రానే వద్దు అంటుంది.
ప్రపంచం మొత్తంలో చాలా దేశాలలోని పరిస్థితి ఇలానే వుంది. సొంత దేశం వదిలి కాందిశీకులుగా వేరే దేశాలకి వెళ్ళే జనం చాలా పెద్ద సంఖ్యలో వుంది. దాదాపు సగం మంది పిల్లలే. జీవితపు భరోసా ఇచ్చే స్వదేశమూ లేదు, ఆదరణ కచ్చితంగా దొరుకుతుందని అనుకోగల ఇతర దేశాలూ లేవు. అంతా అగమ్య గోచర భవిష్యత్తు.
కాందిశీకుల దృష్టికోణం నుంచి ఈ చిత్రం తీసిన మనిష్ రాహత్కర్ ను మెచ్చుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లున్నా సినిమా సాధించిన దానితో పోలిస్తే పట్టించుకోవాల్సినవి కావు. శ్వేతా బాసు ప్రసాద్ నటన బాగుంది.
Spoler ahead మరుసటి వారం ముగ్గురూ కన్సలేట్ కి వెళ్తారు. అక్కడ వున్న మగ అధికారి తను పాపతో ఒంటరిగా మాట్లాడాలి అంటాడు. భయపడుతూనే తల్లి దండ్రులు బయటికి వెళ్ళి కూర్చుంటారు. కాసేపు తర్వాత ఆ అధికారీ, జాస్మినూ బయటికి వస్తారు. మొదట్లో చూసిన గది, కుర్చీలే. అయితే ఈ సారి కెమెరా గేట్ దగ్గర వుంటుంది. లోపలికి చూస్తుంది కెమెరా. కుర్చీలకు పక్కన గోడ కాకుండా గోడంత అద్దం వుంటుంది. అందరూ వారి వారి ప్రతిబింబాలతో ఒకే ఫ్రేం లో కనిపిస్తారు. వీసా అప్రూవ్ అయ్యిందని అంటాడా అధికారి. ముగ్గురూ ఆనందంగా మెట్లు దిగుతారు. వెనుతిరిగి వెళ్ళిపోబోతున్న అధికారికి అక్కడ కుర్చీ కింద ఏదో కనబడి దాన్ని తీసుకుంటాడు. కంటి కింద, కనురెప్పల పైనా నలుపు రంగు పూసే కాస్మెటిక్ అది. ఆ పాపను ఓ వ్యాధిగ్రస్తురాలుగా చూపించాలని వారు చేసిన ప్రయత్నం అర్థం అయినా, బయటి కొచ్చి మీరిది మరచిపోయారంటు అందిస్తాడు.
నేపథ్యం లో పాట. ఏదో దేశంలో సముద్ర తీరంలో ఆ ముగ్గురూ. పది రూపాయలు చూసిన ఆ ఆడ అధికారీ, కాస్మెటిక్ చూసిన ఆ మగ అధికారీ ఇద్దైలోని మానవత్వాన్ని మన ముందు దర్శకుడు బాగా బయట పెట్టాడు.
ఇది ఒక కుటుంబం కథ. ఇలాంటి కథలెన్నో.
Link:
https://youtu.be/noyYvcO_Q_E