[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఇదో రకం చేప (4,2) |
4. కిరీటము (4) |
7. ఇది అనిపించడం అంటే ఏదో ఒక రకంగా అయ్యిందనిపించడం. (2) |
8. హోల్ మొత్తం (2) |
9. ఈ మధ్య వెల్చేరు నారాయణరావుకు ఫెలోషిప్‌ను ప్రకటించిన కేంద్ర సంస్థ. (3,4) |
11. కొరివి (3) |
13. ఈ సారువాడు మగధదేశానికి రాజు. (5) |
14. ఏనుగమ్మ ఏనుగు. (5) |
15. కాపురములో లేదు కదా? (3) |
18. జనుడూ, జీవనమూ. (3,4) |
19. బింబపుష్పకం చేసెడి బెట్టు (2) |
21. తమిళనాడు రాజకీయ నాయకుడు. (2) |
22. పెళ్ళి వేడుకలలో ఇదొకటి. వధూవరులు ఆడుకునేది. (4) |
23. “లవణరాజు కల”లోని ఛందస్సు (6) |
నిలువు:
1. భృకుటి. బ్రహ్మముడి కాదు (4) |
2. తైలములో భద్రముగా కాపాడబడిన శవము శీర్షాసనం వేసింది. (2) |
3. లావు రత్తయ్య జీవిత చరిత్రను రచించినవారి ఇంటిపేరు ముందుకు వచ్చింది. (2,3) |
5. సేమ్ టు సేమ్ (2) |
6. క్రింది దవడ ఎముకలలో యాంగ్యులో స్పెనియల్ ఎముక పైకి పొడుచుకుని ఉండే భాగము. (6) |
9. శ్రీరామాంజనేయ యుద్ధంలో గబ్బిట వెంకటరావు, లవకుశ సినిమాలో సదాశివబ్రహ్మం పాటల్లోని శ్రీరాముడు. (3,4) |
10. శ్రీకృష్ణ తులాభారంలో స్థానం వారి పాట (7) |
11. కడు పుణ్యం చేస్తే ఒకడు పుట్టినదానిలో ఉదరం కనిపిస్తుంది. (3) |
12. ప్రస్తుత రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నది. (3) |
13. ఊసరవెల్లి ఛాయ (2,4) |
16. టైము కలిగిన రసభరితము (5) |
17. కోడి వేలుతో అభ్యర్థన (4) |
20. కిస్తీ (2) |
21. తెలంగాణాకు చెందిన ఓ పట్టణం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 మార్చ్ 23 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 97 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 మార్చ్ 28 తేదీన వెలువడతాయి.
పదసంచిక-95 జవాబులు:
అడ్డం:
1.శరభశరభ 4. జలరుహ/వనరుహ 7.తమ్యా 8.మేమే 9.అదివోఅల్లదివో 11.మిడుత 13.వీరవల్లడు 14.కవిపాదుషా 15.కుదురు 18.టంగుటూరిప్రకాశం 19.కాలి 21.కోన 22.లుక్కాయిత 23.ముద్దబంతిపువ్వు
నిలువు:
1.శతకోటి 2.రమ్యా 3.భలేఅల్లుడు 5.రుమే 6.హమేషాతమాషా 9.అయిదవసంపుటం 10.వోలేటిపార్వతీశం 11.మిడుకు 12.తకరు 13.వీధినాటకాలు 16.దుశ్చరితము 17.బోసినవ్వు 20.లిక్కా 21.కోపు
పదసంచిక-95కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- తాతిరాజు జగం
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- వెంకాయమ్మ టి
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.