మేరే దిల్ మె ఆజ్ క్యా హై-10

2
3

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ సాహిర్ లుధియాన్వీ శత జయంతి సంవత్సరం సందర్భంగా వారి ఎంపిక చేసిన కొన్ని కవితలను ‘మేరే దిల్ మె ఆజ్ క్యా హై’ శీర్షికతో స్వేచ్ఛానువాదం చేసి సంచిక పాఠకులకు అందిస్తున్నారు గీతాంజలి. [/box]

కళాకారుడు! {ఫన్కార్}

[dropcap]నీ[/dropcap] కోసం రాసిన ప్రేమ కవితలను..
బాజారుకి తీసుకొచ్చాను.
ఈ రోజు దుకాణంలో వేలం వేస్తానేమో ఈ కవితలు?
నీ విరహంలో రాసిన కవితలపై..
నా షాయరీలు..గీతాలపై..
అంతేనా నీ పై నాకున్న అనుభూతులపై..
నీ ప్రణయపు పాదాలు మోపి నిర్దయగా నలిచేసావో
అవన్నీ ఈ రోజు బాజారులో వెండి తరాజులో కొలవబడతాయి

నీ జాతి లక్షణం ఏంటంటే..
నా గీతాలను ఆహార దినుసులుగా మార్చిపడెయ్యడానికి సిద్ధం అయిపోవడం!
ఏం చేయను ప్రేయసీ.. నువ్వే చెప్పు!
కళాకారుణ్ణి అయినా నేనూ మనిషినే కదూ?
ఈ ఆకలి ఉంది చూశావూ.. సప్త వర్ణాల ప్రభలతో
వెలిగిపోయే నీ మోము గురించి రాసే గీతాల కన్నా కూడా ..
బీదవాడి అవసరాల గురించే ఎక్కువ ఆశ పడుతుంది.
అందుకే డబ్బొక్కటే చాలనుకునే.. శ్రమ విలువే లేని
ఈ లోకపు వీధులలో.. ధనవంతుల బాజారులో..
నా షేర్, షాయరీలు కూడా నా దగ్గర ఉండలేవు!
ప్రేయసీ .. నీ సౌందర్యం నీపై మరులుగొన్న ఐశ్వర్యవంతుడి సంపదే కావచ్చు గాక!
కనీసం నీ రేఖా చిత్రం అయినా నా దగ్గర ఉండకూడదా?
పోనీలే.. ఇప్పుడు మాత్రం చేయదగ్గది ఏముందని?
ఇదిగో బయలు దేరుతున్నాను
నీ మీద రాసిన గీతాలని బాజారులో వేలం వేయడానికి
ఆకలి రుచి నీకేం తెలుసని?

మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here