[dropcap]ని[/dropcap]రంతరం ప్రయత్నిస్తూనే ఉన్నా
నేనో జ్ఞాపకమై నడయాడాలని..
వయోభేదం లేని లింగ వివక్ష లేని
ఒకానొక ప్రపంచంలో
మధుర జ్ఞాపకమై
ఆత్మీయుల మనోవీధిలో
పచ్చని పతాకమై రెపరెపలాడాలని..
సహకారాలూ మమకారాలూ
చేయూతలూ కౌగిలింతలూ
ఒక కృతజ్ఞతకు కొనసాగింపు
ధన్యవాదాల మేళవింపు కావచ్చు
ఐతే…జ్ఞాపకంగా ముద్రణకై
కొన్ని లక్షణాలు దాన ప్రధానమై
ఒక స్వచ్ఛ వితరణకు ప్రతీక కావాలి..
ఆహ్లాదాన్నీ ఆనందాన్నీ ఇచ్చే
జ్ఞాపకాలు ప్రశాంత పవనాలు
ఒక మనిషికి ఉత్తేజాన్నిచ్చే
నిత్య సుగంధ సుమ చందనాలు.