[dropcap]పు[/dropcap]డుతూనే గొప్పవారు అవ్వలేరు ఎవరు!
అది ఏ కోటికో ఒక్కరికే సాధ్యమవుతుంది!
కాని…
ఎంచుకున్న రంగంలో విశేషంగా కృషిచేస్తూ
లక్ష్యాన్ని చేరుకోవాలని పట్టుదలగా పోరాడుతుంటే
జీవితంలో ప్రతిఒక్కరూ విజేత కాగలరు!
అవమానం ఎదురవుతుంది
అధైర్యం భయపెడుతుంది
నిరాశ నిన్ను నిలువెల్లా కమ్మేస్తూ నీరుగార్చేస్తుంది
అలాంటప్పుడు..పరిస్థితులు జీవితాన్ని ఎలాంటి
ఒడిదొడుకులకు గురిచేసినా ..ఆత్మస్తైర్యాన్ని వీడవద్దు!
ఓటమిలపై అలుపెరగని తిరుగుబాటే.. జీవితమంటే!
తిమిరాలపై సమరం.. వెలుగు కోసం అన్వేషణే.. జీవితమంటే!
పడిపోవడం సహజం
పడ్డామని బాధపడుతూ కూలబడితే ఇక అక్కడే ఆగిపోతాము!
లేచి నిలబడి
చూపు ‘లక్ష్యం’ దిశగా సారిస్తే
నేడు కాకపోయినా
రేపు కాకపోయినా
ఏదో ఒకనాటికి నువ్వు నలుగురు మెచ్చే స్థాయికి చేరుకోగలవు!
అప్పుడు
ప్రపంచం నువ్వు చెప్పే ‘ఓటమిల గుణపాఠాలు’ ఆసక్తిగా వింటుంది!
లక్ష్యాన్ని చేరుకోడానికి నువ్వు పడిన శ్రమని
లక్ష్యాన్ని అందుకోడానికి నువ్వు తపస్సులా భావించిన తపనని
తెలుసుకుని.. ఈ సమాజం నీకొక గుర్తింపునిచ్చి.. గౌరవిస్తుంది!