[dropcap]నిం[/dropcap]గిలోకి చూస్తూ
నెలవంకకు ప్రణామం చేస్తా
శివుని సిగలో పూవు లా
దర్శనం చేసుకుంటా
గోవును చూస్తే
ఆ వెనుకనే గోవిందుడు
వస్తున్నట్లు ఊహిస్తా
కుక్కలను చూస్తే
దత్తాత్రేయ స్వామి
వస్తాడు గుర్తుకు
ఏనుగును చూస్తే
గణపతి కాదు గజేంద్రమోక్షమే
కనులముందు కదలాడుతుంది
ఎలుకను చూస్తే చిన్న దీనిపై
అంత పెద్ద గణపతి ఎలా
చేస్తాడు స్వారి అనిపిస్తుంది
ఎలుక స్థూలం గణపతి సూక్ష్మం
స్థూల సూక్ష్మాలే వ్యక్త అవ్యక్తాలు
అదే కదా జగత్…