[dropcap]”నే[/dropcap]ను కుక్కని పెంచుకోవాలని అనుకొంటా వుండానా” అంట్ని.
“వొద్దురా… దాని పాటికి అది పెరగనీరా” అన్న అనె.
“పెరగాలంటే పెంచాల కదనా?”
“నువ్వు పెంచకుంటే అది పెరిగెల్దారా”
“అట్లని కాదు”
“మడి (మరి)”
“నాకి శాన్నాళ్లనింకా కుక్కని పెంచుకోవాలని ఆశనా”
“సరేరా! నువ్వు అంతగా ఆశ పడుతుంతే నేను ఎట్ల వద్దనేది. అట్లే చేస్తువు కాని నా మాటకి సమాదానం చెప్పరా”
“అదేమో అడుగునా”
“కుక్కని నీ సంతోషం కోసం పెంచుదామనుకొంటా వుండావా? లేదా దాని సంతోషం కోసం పెంచుదామనుకొంటా వుండవా?” అన్న అడిగె.
నాకి ఏమి చెప్పాలో తెలిక పోయ.
నా ఎన్నము (మనసు) ఏడికో ఎల్లీశ.
***
ఏడికో = ఎక్కడికో