[dropcap]దే[/dropcap]వుడు లేడని
ప్రచారం చేస్తే?
మనిషిలో ఉన్న దేవుడు
బయటకొస్తాడేమో?
దేవుడున్నాడని
భయపెడితే
మనిషిలో ఉన్న రాక్షసుడు
బయటపడతాడేమో?
లేడంటే
దేవుడు బయటకొచ్చినా
ఉన్నాడంటే
రాక్షసుడు బయటపడినా
ఇద్దరూ మనుషులుగా
ఒక్కటే.
ఇద్దరు అనుకొనే దేవుడూ
ఒక్కడే.
మనిషి కనిపెట్టిన దేవుడితో
దేవుడు సృష్టించిన మనిషితో
లోకం ఒక వింత.
మనిషి మరో వింత.