[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.
~ ~
స్వతంత్రతా గృహిణి
శ్రద్ధగా పెట్టిన
ఊరగాయలు
పిఎస్‌యులు!
క్రోనీ విందుకు జుర్రేరు!
~ ~
దైవం ఎదురైతే
పక్కకి తప్పుకొని
మనిషి ఎదురువస్తే
చేతులు చాపుతాను!
మనిషికి మనిషే నమ్మకం!
~ ~
ఆకాశపు ఎత్తుల్లో
సముద్రపు లోతుల్లో
మంచు లోయల్లో
పర్వత పాషాణాల్లో
సంతలు… పుంతలు!
~ ~
తాటి తోపులు
పూల పొదలు
కొండ గుట్టలు
ఇసుక ఎడారులు
దాగని సృష్టి నిజాలు!