[dropcap]ఆ[/dropcap]ట,పాటలను నిత్యం ఆస్వాదిస్తూనే
చదువులమ్మ గుడికే వన్నె తెస్తారు
కోవెలలో వెలిగే చిట్టి దివ్వెలు ‘బాలలు’
వివిధ కళలలో ప్రావీణ్యం సాధిస్తూనే
కన్నవారి కలలను సాకారం చేస్తారు
కళామతల్లి కాలి మువ్వలు ‘బాలలు’
విహంగాలులా స్వేచ్ఛగా విహరిస్తూనే
స్నేహ పరిమళాలను వ్యాపింపచేస్తారు
చెలిమి గూటిలో ఒదిగే గువ్వలు ‘బాలలు’
బడిలో చక్కటి క్రమశిక్షణ పాటిస్తూనే
గురువులకు ప్రియ శిష్యులవుతారు
ఆకాశంలో వెలిగే తారాజువ్వలు ‘బాలలు’