[dropcap]క[/dropcap]ళలు –
హృదయాంతరాళాలలో
నిక్షిప్తమై వున్న భావ పరంపరలు!
మనసును రంజింపజేసే
అలౌకిక ఆనందడోలికలు!
ఆలోచనామృతాన్ని అందరికీ పంచి
అమరులను జేసే సంజీవనులు!
బాధలను మైమరపించి, మురిపించే
మలయ మారుతాలు!
మానసిక కాలుష్యాన్ని తొలగించి
మమతల పరీమళాన్ని వెదజల్లే మల్లియలు!
భిన్న దేశాల, జాతుల మధ్య వారధిగా నిలిచి
ఆత్మీయ బంధాన్ని పెనవేసే వల్లికలు!
కళలు –
సంస్కృతీ సంప్రదాయ ప్రతిబింబాలు!
సంస్కార సౌరభోత్కరాలు!
కళలు –
ప్రాపంచిక దీపికలు!
సౌగంధిక మాలికలు!