[dropcap]పా[/dropcap]రిపోవాలనిపించే పరిస్థితులు కొన్ని వచ్చినప్పుడే
ప్రపంచం ఒంటరిని చేసి నవ్వేస్తుంది.
నీ బలహీనతలన్ని ఒకరి బలాలుగా
నీ బలాలన్ని భయానికి బందీలుగా మారిపోతాయ్ నవ్వే ప్రపంచంలో, నటించే మనుషుసులున్నారని
తెలిసాకా.
జీవించడం మాని బ్రతకడానికి అలవాటు పడిపోతావు
నిద్రలేని రాత్రుల్లో కొన్ని ఆలోచనలు నిన్ను హత్య చేస్తాయి
అలసిపోయిన మనసంటే కళ్ళకి అలుసై
కంటి చివరన కన్నీళ్లు ఆత్మహత్య చేసుకుంటాయ్,
నిశ్శబ్దన్ని దాచుకున్న
నీ మౌనం మెల్లిగా గుండెల మీద డమరుకంలా మోగుతుంది.
దేహానికి,దహనానికి మధ్య నిశ్శబ్ద యుద్ధం.
నాది నాదని అనుకున్న నీది ఇక్కడేది లేదని,
ఏది జరిగిన కర్త, కర్మ, క్రియ నువ్వే అని తెలిసాక ఆత్మహత్య చేసుకున్న కన్నీళ్లు బలహీనులని
హత్య చేసిన ఆలోచనలు భయాలని తెలుసుకుంటావ్
ఇప్పుడు నీది పరుగు