[dropcap]కు[/dropcap]రుస్తున్న మంచుబిందువుల జల్లుల్లో
తడుస్తూ నడుస్తున్నాను!
జతగా నువ్వు ..
నా తోడై కలిశాక
అడుగులు ధీమాగా ముందుకే సాగుతున్నాయి!
సంపెంగలు,సన్నజాజులు
పున్నాగలు,నందివర్ధనాలు
దారికి ఇరువైపులా చేరి
స్వాగతం పలుకుతుంటే
సుపరిమళాల నడుమ
‘నేస్తమైన’ నీ చిరునవ్వుల సడిలో..
తన్మయమై.. వలపుపారవశ్యంలో..
చైతన్యమై..సంబరంగా..
అడుగులు ధీమాగా ముందుకే సాగుతున్నాయి!
గెలుపుశిఖరాలపై.. విజయబావుటా ఎగురవేయాలని..
ప్రేరణ నరనరాన విజయకాంక్షను నింపగా..
అడుగులు ధీమాగా ముందుకే సాగుతున్నాయి!