[dropcap]”నా[/dropcap]ది కుక్క బదుకునా” బేజారుగా అంట్ని.
“నాది నక్క బదుకునా” ఇంగా బేజారుగా అనె వాడు.
“నాది ఊసరవెల్లి బదుకు. మీకన్నా రవంత పర్వాలే” అనే వీడు.
“అహహ! పొండ్రారేయ్, మీరు మీ బదుకులు. నాది పులి బదుకురా” యిరివిగా అనె ఇంగొగడు.
ఈ మాట్లు వినిన అన్న “అదేలరా మీ బదుకుల్ని అట్ల పోల్చుకొంటారు?” అని అడిగె.
“ఉండేదే చెప్పితిమి అంతే” అంద్రు ఒగేకిత అంటిమి.
“అట్లనా?”
“ఊనా”
“సరే! నా మాటకి బదులు చెప్పండ్రా. పొద్దప్పడు (సూర్యుడు), సెంద్రుడు ఇద్దరు వెలుగు ఇస్తారు కదా, దీంట్లా ఎవరు గొప్ప” అన్న అడిగే.
“పగలు పొద్దప్పడు, రాత్రి సెంద్రుడు ఇట్ల వాళ్లిద్దరూ గొప్పే” అంటిమి.
“అంటే ఎవరి కాలంలా (టైం) వాళ్లు గొప్ప అంతే కాని ఎవరూ గొప్పా కాదు, తక్కువ కాదు. అర్థము అయినారా?”
“అయెనా”
“ఏమాయె?”
“ఇంగ మీట మా బదుకుల్ని వేరే వాళ్ళ బదుకులకి పోల్చుకొనెల్దునా. మాది గొప్ప బదుకేనా” అంద్రు అట్లే అంటిమి.
అన్న నగుకొని ఎల్లీశ.
***
నగుకొని = నవ్వుకుని