[box type=’note’ fontsize=’16’] రాష్ట్రాల నడుమ, లేదా పరిశ్రమల నడుమ కార్బన్ సర్టిఫికెట్ల మార్కెట్లను పెంపొందించుకోగలిగితే పరాధీనత ఉండదని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]
రక్షో రక్షితః:
[dropcap]కీ[/dropcap]కారణ్యాలలో నరికివేతల కారణంగా అరణ్యాలలోనూ మట్టిసారం తగ్గిపోతోంది. మామూలు నేలలలో సైతం జీవపదార్థాల శాతం బాగా తగ్గిపోతోంది. 1900 సంవత్సరం వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 13.73 సెల్సియస్. అంతర్జాతీయ సమగ్ర పర్వతాభివృద్ధి సంస్థ 2019 సంవత్సరానికి గాను వెలువరించిన నివేదిక 20వ శతాబ్దం నుండి హిమాలయాలలో సగటు ఉష్ణోగ్రత 2° పెరిగిందని వెల్లడించింది. కారాకోరం పర్వత శ్రేణిలో ప్రపంచ సగటు కంటే కొంచెం తక్కువగా (0.7°) ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. అంటే, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతను కట్టడి చేయగలిగినా కూడా హిందూకుష్ శ్రేణిలో ఆ సగటు కంటే ½° సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగానే ఉండే అవకాశాలు ఎక్కువ. అంటే గ్లేసియర్లు కరగటం ఖాయం.
యూరోపియన్ యూనియన్‍లో, యూ.ఎస్.లో, పర్యావరణ నిబంధనల ప్రక్రియలో ప్రజలకు భాగస్వామ్యం ఉంటుంది. పరిశ్రమల/ప్రాజెక్టులకు సంబంధించి జవాబుదారీని పెంచే చట్టాలు, ప్రజాభిప్రాయానికి విలువనిచ్చే చట్టాలూ ఉన్నాయి. మనదేశంలో అటువంటి నిబద్ధత కొరవడిన కారణంగానే ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులకు అనుమతులు లభించేస్తున్నాయి. విచక్షణారహితంగా సాగిపోతున్న తవ్వకాలు, నిర్మాణాలూ, పెను ఉత్పాతాలకు కారణం అవుతున్నాయి. వివిధ ప్రాజెక్టుల నిమిత్తం అరణ్యాల నరికివేత విచక్షణారహితంగా సాగిపోతోంది. ఆ కారణంగా భూఉపరితల, అంతర్గత సమతౌల్యం దెబ్బతింటోంది. ఉపరితల సమతౌల్యం దెబ్బతినడం వలన భూమి కోతకు గురికావడం, భూసారం క్షీణించడం వంటి వైపరీత్యాలు సంభవిస్తుండగా, అంతర్గత సమతౌల్యం దెబ్బతినడం వలన భూకంపాల వంటి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. అదీ కాక –
2017లో 42 మిలియన్ టన్నుల పెరుగుదల నమోదు చేసిన కార్బన్ నిల్వల స్థాయి తరువాతి కాలంలో 21 మిలియన్ టన్నులకు పడిపోయింది. అంటే కార్బన్ నిల్వల పెరుగుదల సామర్థ్యం సగానికి సగం కోసుకుపోయింది.
అడవులలోని కార్బన్ నిల్వలు వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువును గ్రహించి నిల్వ చేయడంలో తోడ్పడుతాయి. ఆ సామర్థ్యం తగ్గిపోతూండమంటే పర్యావరణ పరంగా మరింత ప్రమాద పరిస్థితులు ముంచుకొని వస్తున్నట్టే. 21 మిలియన్ టన్నుల కర్బన నిల్వలు 78 మిలియన్ టన్నుల కార్బన్ డై యాక్సైడ్‌ను శోషించుకోగల స్థాయికి సమానం. ఆ రకంగా ఉద్గారాల నియంత్రణలో పరోక్షంగా అరణ్యాలు కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి.
వాతావరణంలో హరిత వాయువులు/Trace Gases ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంలో ముఖ్యపాత్ర వహించిన పారిశ్రామిక దేశాలకు – పారిశ్రామిక మితిమీరని దేశాలను నడుమ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యకలాపాలలో ఆర్థిక సహకారానికి వారథిగా వినియోగించుకోగల వెసులుబాటు ఉన్న ‘కార్బన్ పరపతి’ విధానం ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్నదే. అయితే –
2019లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‍లో జరిగిన COP-25 ‘కార్బన్ క్రెడిట్ల’ మార్కెట్‍కు స్పష్టమైన విధి విధానాలను రూపొందించ లేకపోయింది. ఆ కారణంగా 2020లో బ్రిటన్‍లో జరిగిన COP-26లో కార్బన్ క్రెడిట్ల వినియోగానికి సంబంధించి వివిధ దేశాల నడుమ ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పర్యావరణ హితంగా మెలగి సంపాదించుకున్న కార్బన్ క్రెడిట్లు మురిగిపోగలవన్న ప్రమాదం ఉందని పురోగామి దేశాలు భయపడటం సహేతుకమే. కారణం స్పెయిన్ వంటి సంపన్న దేశాలలో పాతతరానికి చెందిన పరిశ్రమలు అనేకం మూతబడ్దాయి. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం కారణంగా ధనిక దేశాలు సైతం ఉద్గారాలను ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గించుకోగలిగాయి. సహజంగానే ‘కార్బన్ క్రెడిట్ల’ విధానం రూపొందిన నాటికి వాటికి ఉన్న డిమాండ్ ఇటీవలి కాలంలో బాగా తగ్గింది.
ఈ నేపథ్యంలో బ్రెజిల్, కెనడా, చైనాలు స్వతంత్రంగా కార్బన్ క్రెడిట్ మార్కెట్‍లను అభివృద్ధి చేసుకుంటున్నాయి. మన దేశంలో కూడా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రాల నడుమ, లేదా పరిశ్రమల నడుమ ఈ కార్బన్ సర్టిఫికెట్ల మార్కెట్లను పెంపొందించుకోగలిగితే పరాధీనత ఉండదు. ఏది ఎలా సర్దుబాటు చేసుకున్నా ఒక్కటి మాత్రం గుర్తుంచుకోకతప్పదు. ఈ పకృతి మొత్తం ఒకే ఒక వ్యవస్థ. వ్యవస్థలో ఎక్కడ ఏం అంశం దెబ్బతిన్నా మొత్తం వ్యవస్థపై ప్రభావం పడితీరుతుంది. వ్యవస్థ సంతులనం దెబ్బతినకుండా ఉండాలంటే అన్ని దేశాలు జాగురూకతతో మెలగి ప్రకృతి వ్యవస్థను కాపాడుకొని తీరవలసిందే.