పదార్ధం అందని స్వార్థం

0
3

[dropcap]పా[/dropcap]ర్టీ ఆఫీసులో మీటింగ్ నడుస్తోంది. చెంచల్ రావు జిల్లా పరిషత్ ఎన్నికలు గెలుపొందిన సందర్భంగా ఇది అభినందన సభ. ప్రజాసేవ చేసినందుకు కాదు, ఎన్నికల్లో గెలుపొందినందుకు. చెంచల్ రావుది అసలు ఈ జిల్లా కాదు. పొట్ట చేత పట్టుకొని వాళ్ల పెద్దలు ఇటు వలస వచ్చారు. పల్లెనున్న గూడెం పక్కన గుడిస వేసుకొని వాళ్లు చెలకలు, పొలాలు, సాలుకు తీసుకొని మనుగడ ప్రారంభించారు. ‘కోయగూడెంలో కోమటి కర్ణికం’ అని అనామకంగా అమాయకత్వంతో బ్రతుకుతున్న వారికి తలలో నాలుకలా అయ్యారు. అప్పటి ‘పటేళ్ల’ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి జనానికి బాగా దగ్గరయ్యారు. ఆ బాపతుగా తల లేపాడు ఈ చంచల్ రావు. గాంధీజీ ఉద్యమం పట్ల ఆకర్షితుడై స్వతంత్ర ఉద్యమంలో ఉడతా భక్తిగా పాల్గొన్నాడు. అక్కడున్న రాజకీయ మలుపుల కారణంగా జిల్లా పరిషత్ ఎన్నికలో గెలిచాడు. ఆ సీట్లో  కూర్చున్న తర్వాత తనవారు కొందరు అక్కడుండటం సబబు అనే భావనకొచ్చి ‘కుక్కల పున్నయ్య’ను, ‘బలిజీ రామచంద్రులు’ అనే చదువుకున్న యువకుల్ని ఆఫీసు గుమస్తాగా పెట్టుకున్నాడు. రామచంద్రుడు ఎప్పుడూ ఆఫీసులో పడి ఉండేవాడు. చిన్న చితకా పనులన్నీ అతనే చూసేవాడు. పున్నయ్య మాత్రం చంచల్ రావు వెంట ఉండి జిల్లా అంతా తిరుగుతుండేవాడు. కొంచెం చురుకయినవాడు. చంచల్ రావు ఎక్కే మెట్లల్లో కొన్ని పున్నయ్యకే వదిలేసేవాడు. ఆ సందర్భంగా కొన్ని అవకాశాలొచ్చినయి. పున్నయ్య హితుడు గనుక చూసి చూడనట్టుగా ఉండేవాడు చంచల్ రావు.

కాలగమనంలో చంచల్ రావు మంచిగా ఎదిగాడు. అవకాశం కలిగి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ మలుపుల్లో పున్నయ్య రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఓ బోర్డుకు ఛైర్మన్ అయ్యాడు. రామచంద్రు మాత్రం ఇప్పటికీ ఆఫీసు ఇంఛార్జిగానే ఆగిపోయాడు. పున్నయ్య మాత్రం అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకుని కలెక్టర్‌ని అల్లుడుగా చేసుకోగలిగాడు. కొడుకు అటవీశాఖ ఆఫీసరు అయ్యాడు.

పున్నయ్య మాటకారి, హరిజనోద్ధరణపై దళితుల పురోగతిపై బాగా మాట్లాడగలిగేవాడు. కులాంతర, మతాంతర వివాహాలు జాతి జీవనంలోని అంతరాలని పారద్రోలుతాయని సోదాహరణంగా చెప్పేవాడు. హరిజనోద్ధరణే మానవ సేవనీ, దాన్నే మాధవ సేవగా భావించాలని బాగా చెప్పేవాడు. దృష్టి బేధం ఆర్థిక స్థితులో సమసిపోయాక అంతా ఒకటే కదా! “నేను పార్టీకి, తద్వారా జాతికి దేశానికి, చాతనయినంత సేవ చేశాను. అది గుర్తించి నన్ను ఆదరించారు. ఇప్పుడు నా అంతట నేను నా శక్తితో మీకు సేవచేయగలిగే స్థితిలో ఉన్నాను.” అనేవాడు. అప్పటి కుక్కల పున్నయ్యను చూశారు జనం. ఇవాళా చూస్తున్నారు. అతను చెప్పేది ఇప్పుడూ వింటున్నారు. వాళ్ళకు కుక్కల పున్నయ్యలో కలిగిన మార్పు, చాలా స్పష్టంగా అర్థమయింది, దళిత జనోద్ధరణలో భాగమే ఇతను దళితులనొదిలి, ఇతను మాత్రం అంతులేకుండా ఎదిగాడు. దేశంలో పేదవారంతా ఇలానే అభివృద్ధిలోకి వచ్చారా!  ఇది నిజం కాదు కదా! ఇది అందరికి తెలిసిన మాట! 

***

హరిజనోద్ధరణ జాతి జీవనంలో భాగం. అట్టడుగున మనిషికి ఆసరా ఇచ్చి, జనజీవితంలో వారిని కలపడం. కాని వాళ్ళకున్న ఏర్పరిచిన కోటాల పేరుతో వ్యక్తులు హద్దుల్లేకుండా సంపాదించుకోవటం కాదు. అదీ కోటాల్లో సీట్ పొందిన వారు మాత్రమే. ఇది తోటి వారి సముద్ధరణ అవుతుందా? కాదు గదా. పైగా జాతి జీవనంలోని అసమగ్రత అవుతుంది. ఇది పరిష్కారం అవుతుందా? ఆలోచించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here