[dropcap]ప్ర[/dropcap]పంచానికి మూలం అమ్మ
మనిషి జన్మకి రూపం అమ్మ
నీ జీవానికి ప్రాణం అమ్మ
తీర్చలేని రుణం అమ్మ
పెదవులు పలికే కమ్మని పదం అమ్మ
మధురమైన తొలి పలుకు అమ్మ
నిను ఓదార్చే చల్లని హస్తం అమ్మ
మనల్ని తన ఒళ్ళో సేద తీర్చి
తాను కష్టపడుతూ తన ప్రాణం కన్న
మిన్నగా మనల్ని కాపాడేది అమ్మ
అమ్మ రూపం అపురూపం
ఆమ్మ పలుకు మాధుర్యం
అమ్మ ప్రేమ అపారం
అమ్మ సర్వస్వం