[dropcap]చి[/dropcap]న్ని నవ్వులకే మాటలు వస్తే
చిలిపి చూపులకే నవ్వడం వస్తే
వయ్యారి నడకలకే ఆలోచనలొస్తే
ఒదిగే గుండెకూ నడత వస్తే
ఇది ప్రేమా ?
అది ఏంటో చెప్పడం రాదమ్మ!
నావలోని తెడ్డుతో నీటిని నడిపిస్తుంది ప్రేమ
రెక్కల సాయంతో గాలిని నడిపిస్తుంది ప్రేమ
నీ జ్ఞాపకాలతో నా ఊపిరి నడిపిస్తుంది ప్రేమ
మనసారా నా భావాలు నన్ను స్పృశిస్తే
సీతాకోక చిలుక రంగులు విసిరితే
వాలు జడలో మల్లెపూలు దోపితే
సంధ్యవేళ కడపటి తరగ నీ చిటికెన వేలు తాకితే
తామర దోనెలో నీటి బొట్టు అటూ ఇటూ నాట్యమాడితే
గుండె జారి గల్లంతయ్యేలా చేస్తుంది ప్రేమ!
ఇది ప్రేమా ?
అది ఏంటో చెప్పడం రాదమ్మ!