[dropcap]ఆ[/dropcap]’కారా’నికి అలం’కారం’ అద్దుతూ,
అప’కారా’నికి ఉప’కార’మే ప్రా’కార’మై,
సం’స్కార’వంతమైన నమ’స్కారా’నికి
శ్రీ’కారం’చుడుతూ,
అధి’కార’పు అహం’కారా’న్కి
మమ’కారం’తో పరి’ష్కారం’ చూపుతూ,
ఆవి’ష్కారా’నికి పుర’స్కారం’తో
స’త్కారం’ అందిస్తూ,
వి’కార’పు ప్రతీ’కారా’లకు
తిర’స్కారం’ తెలుపుతూ,
వెట’కార’పు
చమ’త్కారా’లకు స్వస్తిపలుకుతూ,
అధి’కార’, అనధి’కార’ హూం’కారా’లను
అంగీ’కారం’ లేని ధి’క్కారం’తో ఎదురిస్తూ,
హాహా’కార’పు ఘీం’కారా’లను
శాంతా’కార’పు మనస్సుతో జయిస్తూ,
సహ’కార’మే నీ జీవన నుడికారమై,
పరోప’కారం’ నీ జీవితపు గుణకారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా!!