[dropcap]ఒ[/dropcap]కప్పుడు
కరకు కత్తులతో
ప్రపంచాన్ని జయించాలని
ఎన్నో దేశాల్ని సర్వనాశనం చేసినా….
ఒకప్పుడు
మోసపు ఎత్తులతో
ప్రపంచాన్ని జయించాలని
ఎన్నో జాతుల్ని సర్వనాశనం చేసినా…
చరిత్రలో
మాయనిమచ్చగా మిగిలాయే తప్ప…
ప్రపంచానికి ఏ వెలుగు అందివ్వలేకపోయాయి..
ఆయా మతాలు….ఆయా సమూహాలు….
కాని నేడు
ప్రపంచానికి
కావాల్సింది జ్ఞానం…
జ్ఞానమనే ఖడ్గంతో
అజ్ఞానపు చీకట్లను చీల్చేద్దాం
కావాల్సింది శాంతి….
శాంతియనే ఆయుధంతో
అశాంతిమూకలను తరిమేద్దాం
కావాల్సింది ధర్మం…
ధర్మమనే దండంతో
అంధమతోన్మాదులని దండిద్దాం
కావాల్సింది సంఘం….
సంఘమనే శక్తితో
సమాజవిద్రోహులను సంస్కరిద్దాం
ఆ జ్ఞానఖడ్గం
ఆ శాంతి ఆయుధం
ఆ ధర్మదండం
ఆ సంఘశక్తి
భారత్ కే సొంతం…….అందుకే
భారత్ మేల్కొనాలి…..
ఈ ప్రపంచాన్ని మేల్కొల్పాలి……