[dropcap]ప[/dropcap]చ్చతోరణం ఇంటికి శుభ సూచకం
పచ్చని వృక్షం దేశానికి లాభదాయకం
దేహానికి క్షేమ దాయకం ॥పచ్చ॥
వృక్ష సంతతి నిర్మూలనం
మానవ జాతి వినాశనం
చేపట్టాలి చెట్లు నాటే ఉద్యమం
అరికట్టాలి రాబోయే ప్రమాదం ॥పచ్చ॥
వృక్షాన్ని కూల్చకండి
విశ్వాన్ని కాల్చకండి
విత్తును ఇప్పుడే నాటండి
విపత్తు వెంటనే ఆపండి ॥పచ్చ॥
పర్యావరణ పరిరక్షణం
జనాళి తక్షణ కర్తవ్యం
అప్పుడే ప్రపంచ కళ్యాణం
విశ్వమానవ సౌభాగ్యం ॥పచ్చ॥