[dropcap]చి[/dropcap]న్నరి పొన్నరి పిల్లలు
చిరు చిరు వాన జల్లులు
మరుల పాల వెల్లులు
సిరుల మరు మల్లెలు ॥చిన్నరి॥
అమృతంపు ధారలు
అమల జల తరంగాలు
చైతన్యపు గీతికలు
చిన్మయుడి చిహ్నాలు ॥చిన్నరి॥
అందాల తారకలు
అపరంజి బొమ్మలు
కర్పూరపు తావులు
కాంతి చిహ్నమూర్తులు ॥చిన్నరి॥
నైర్మల్యపు నవ్వులు
అరవిరిసిన పువ్వులు
అనురాగపు భావాలు
ఆత్మీయపు భావనలు ॥చిన్నరి॥