[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.
~ ~
ఆట బాగుందని సచిన్
కెరీర్ కొనేసిన నీతి
సేవ బాగుందని
సోనూ సూద్కి సొమ్ము నివ్వదు!
సాయం పెట్టుబడి
కాదన్న కుటిలా!
~ ~
అచ్ఛే దిన్
ఓ గమ్యం!
అందుకోవాలంటే
అటు అడుగేయాలి!
రోత నేతల హామీలు
నమ్మితే అవుతుందా?
~ ~
కోవిడేశ్వరికి
నిలువు దోపిడీలు
వైరస్ జనులకు
కొరత కొరివిలు!
తెరచుకుంది మహమ్మారి..
ఎంటర్ అక్రమ వ్యాపారి!
~ ~
హిందూ, ముస్లిమ్
క్రిస్టియన్, బౌద్ధ..
సకల మతాలకూ
ఒకటే మరణం!
కొరతల జమానాలో
సమవర్తి కరోనా!