[dropcap]చి[/dropcap]న్ననాడు నడకను
పెద్దయ్యాక నడతను
తప్పటడుగుల్లో తప్పును
నడవడికలో నాణ్యాన్ని
ఒరవడిలో ప్రవాహాన్నీదటం
పనిలో సృజన నైపుణ్యాలను
పదుగురు తో పదం కలపటం
నలుగురికి అండగా నిలవటం
నైతిక విలువల పై పోరాటం
సాంప్రదాయాలను పాటించటం
ఆత్మవిశ్వాసమనే ధనం
అరుదైన ప్రేమ ఇంధనం
అన్నీ.. అన్నీ
నాన్న నేర్పిన పాఠాలే!