[dropcap]”అం[/dropcap]డం పిండం అవుతుంది. అణువే బ్రహ్మాండం అవుతుంది అంటారు కదనా? ఇది ఎట్లనా? దీని కత రవంత చెప్పునా?”
“రేయ్! మన కంటికి కనబడనంత చిన్నగా వుండే అండం తల్లి గర్భములా చేరినంక పిడికెడంత పిండంగా మారి పెరిగి పెద్దదయి బిడ్డగా పుట్టి, చిన్నోడిగా, పెద్దోడిగా, అబ్బగా, తాతగా మారతాడు కదరా?”
“అవునునా”
“ఏమి జరిగెరా?”
“మార్పు చెందెనా. ఇంతే అంతగా మారెనా?”
“కదా”
“అవునునా”
“వాన చినుకు ఎంతరా?”
“ఇంతే ఇంతనా”
“నది ఎంతరా?”
“శానా శానా నా”
“ఏమి జరిగెరా?”
“ఇంతే అంతగా మారెనా… మార్పు చెందెనా”
“ఇబుడు తెలిసెనా? అణువే బ్రహ్మాండం ఎట్ల అవుతుందని”
“ఊనా”
“మార్పులా అణువే బ్రహ్మాండం అవ్వచ్చు. అదే బ్రహ్మాండం బద్దలై కాలి బూడిదవ్వచ్చు. అణువంతగా మారిపోవచ్చు” అని పోయ అన్న.
***
శానా= చాలా