[dropcap]సూ[/dropcap]ర్యోదయము ఎప్పుడు అందంగానే ఉంటుంది. ఆ రోజు ఆదివారం. పిల్లలు బాదం చెట్టు కింద కాయలు ఏరుకుంటూ చప్పుడు చేస్తున్నారు చిన్న చిన్న పాదాలతో. పండుటాకులు పెళ పెళ మని చప్పుడు చేస్తున్నాయి.
బాల్కనీలో నించుని కిందకి చప్పుడు వేపు చూస్తున్న అన్నపూర్ణ కళ్ళలో కొంచెం బాధ తొణికిసలాడుతోంది.
అక్కడ గోదావరి బాదం చెట్టు, రాచ ఉసిరి చెట్టు, గోరింట చెట్టు, కాడ మల్లి చెట్లు ఉన్నాయి. అవన్నీ పిల్లల కోసం వేసింది. పిల్లలు ఎదిగి పెళ్లిళ్లు వేసుకుని అత్తింటికి వెడితే, కొడుకులు విదేశాలకు వెళ్లారు. కానీ తను వేసిన మొక్కలు ఎంతోమంది పిల్లలకి ఉపయోగపడ్డాయి. చాలా పువ్వులు, కాయలు, గోరింటాకు పెళ్లిళ్లకు పట్టుకెడుతు సమాజ సేవ చేస్తున్నాయి.
మానవులు చట్టం చూపుగా వచ్చి వెడుతుంటారు. జీవితంలో అమ్మ కడుపున వంటరిగా పుట్టే తాము వెళ్ళేటప్పుడు వంటరిగా వెడ్తాము. శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అమృత కీర్తనలో ‘పుట్టుట గిట్టుట నిజము నట్ట నడుమ పని నాటకము’ అన్నట్లు మనిషి పుట్టి పెరిగి చదువుకుని ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించి ఒక దారికి తేవడం, ఆ తరువాత కొందరు తల్లి తండ్రులను వృద్ధాశ్రమంలోనూ పిల్లలను హాస్టల్స్ లోనూ పెట్టేసి ఎవరి ఉద్యోగాలు వారు చేస్తున్నారు.
ఇది నేటి జీవితము. పెద్దవాళ్ళు ఇచ్చే ఆస్తులు అవసరం లేదు. పెద్ద పెద్ద ఇళ్లు అలా ఖాళీగా ఉండిపోతున్నాయి. అటువంటి ఇళ్ళల్లో కొందరు పిల్లలు తల్లీ, తండ్రినీ చూడటానికి లేని కుటుంబాలను ఎంపిక చేసుకుని వారికి ఇచ్చి తల్లి తండ్రులకి కేర్ టేకర్స్‌గా పెట్టి ఉంచుతున్నారు.
కొందరు ధ్యాన మందిరాలుగా ఇచ్చి పైన మేడ మీద వాళ్ళు ఉండి కింద వృద్దులకు ఆశ్రమాలుగా కొందరు ఏర్పాటు చేస్తున్నారు.
మనిషి సంఘజీవి. తోటి మనుషుల బాగు వోగులు అడుగుతూ ఉంటూ కాలం గడుపుతారు. అందుకు అనుకూలంగా కొందరు జీవితాలను మలచు కొంటున్నారు.
పిల్లలు విదేశాలకు వెళ్ళాక ఒంటరి తనంతో ఉండలేక ఇలా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నపూర్ణ. అప్పుడప్పుడు తన స్నేహతురాలికి సహాయంగా వృధ్ధ ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళతో గడిపి వస్తుంది.
గాంధీ జయంతి కారణంగా పిలిస్తే వెళ్ళింది. అక్కడ కోడలితో దెబ్బలాడి వచ్చిన కోమల, కూతురుతో దెబ్బలాడి వచ్చిన కామాక్షి ఇలా ఇద్దరినీ ఒక గదిలో పెట్టారు.
ఎక్కడ ఒక్కరూ ఉండరు. భార్య భర్త, ఇద్దరు పిల్లలు, కొడుకు కోడలు, కూతురు అల్లుడు, మనమలు ఇలా కుటుంబ వృద్ధి చేసేలా దైవ నిర్ణయంగా సృష్టంచబడింది. ఇప్పుడు కూడా దైవ సంకల్పంలో మనిషిని వివేకవంతుడిగా పుట్టించాడు. ఆయన మనిషికి రెండు కళ్ళు, రెండు చెవులూ, రెండు చేతులు, రెండు కాళ్ళు, ఒక నోరు, ఒక ముక్కల్లో రెండు రంధ్రాలు, మెదడులో తెలివి పెట్టీ తల భాగం గాను; హృదయంలో నాలుగు భాగాలు, కాలేయం కిడ్నీలు రెండు భాగాలుగా; శ్వాస కోశసంపద కూడా రెండు భాగాలు ఇలా మానవ సృష్టి జరిగింది.
పెద్దపేగు, చిన్న పేగు, ధమనులు సిరలు, రక్త నాళాలు, ఎన్నో నాడులు మానవ శరరములోని భాగాలు. వాటితో పాటు అహం, కోపం, క్రోధం, దురాశ, అసూయ వంటి పంచ క్రోధాలు. శాంతి, సహనం, సౌశీల్యం, మమత మానవతా వంటి పంచ శాంతులు మానవ వరాలు. వీటితో ఉన్నత ఉత్తమ జీవితం గడపాలి.
చాలా డబ్బున్న కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది కొందరిని అక్కున చేర్చుకుని అన్నం పెడుతున్నాయి. మంజీర ఆదేశం, ఆదర్శం మేరకు అన్నపూర్ణ కూడా ఈ తరహా వృధ్ధ ఆశ్రమాలను నడపడం అలవాటు చేసుకుని అన్నపూర్ణ పేరును సార్థకత చేసుకుంది.
అక్కడ ఆశ్రమంలో అంతా ఎండుటాకులు, పండుటాకులు. ఆహారం ఆవాసం ఆహార్యం ఇచ్చి ఒక చోట అందరినీ చేర్చి జీవితము ఇవ్వడమే తాము చేస్తున్నది. ఇంకా చాలా ఓపిక ఉంది. కొడుకులు విదేశాలకు రమ్మనమని వీసాలు పంపారు. కానీ అన్నపూర్ణకు ఇష్టంలేదు.
కారణం తన అన్నగారు అదే బాణీలో ఉన్నాడు. అందుకని అన్నయ్య తను కలసి ఉండి ఒక సంస్థ ఏర్పాటు చేసి అందులో ఏదో కొంత మందికి ఆవాసం ఆహారం ఇవ్వాలని సంకల్పంతో ఉన్నారు. అదే విషయం తన ఫ్రెండ్ మంజీర ఆశ్రమం మాదిరి పెట్టాలని కోరిక వేళ్ళ బుచ్చింది అన్నపూర్ణ. దానికి మంజీర నవ్వి “అలాగే చెయ్యి నా సహాయం ఎప్పుడు ఉంటుంది” అన్నది.
సమాజంలో కొంత కాలం స్కూల్స్ పెరిగాయి. ఆ తరువాత హాస్పిటల్స్ పెరిగాయి. ఇప్పుడు వృధ్ధ ఆశ్రమాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం కుటుంబాల్లో స్వార్థం పెరగడం. తల్లి తండ్రులను వదిలి వెయ్యడము అలవాటు చేశారు. ఇప్పుడు వృద్దాప్యంలో బాధ పడితే ఎలా?
జీవితంలో ఉన్న దశలన్నిటిలోకి వృద్ధాప్యం సక్రమంగా వెళ్ళడం కష్టం. వారి ఆలనా పాలనా చూసే వ్యక్తులు లేరు. కారణం వారు వారి గొప్పలు గురించి చెబుతూ కోడళ్లను, మనుమలను విమర్శిస్తూ, నీతులు చెపుతూ
ఆధునిక దుస్తులు వద్దు అని; మిడిలు, నైటీలు వద్దని చెపుతూ విమర్శిస్తూ మనిషి కనబడేటప్పటికి ఆజ్ఞలు వేస్తూ అలా వద్దు ఇలా వద్దు అంటూ తమ విషయాలు చెపుతూ ఆధిక్యత చూపుతారు. దానితో ఈ తరం మనుమలు వ్యతిరేకత చూపిస్తారు.
ఏదో ఒక కారణం మనిషిని దూరం చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళు కుటుంబ సభ్యులలో వ్యతిరేకత కల్గించుకుని వారికి దూరంగా ఉంటున్నారు అనే కంటే దూరంగా పెడుతున్నారు అనేది నిజం. ఇది ఇంచుమించు ప్రతి ఇంటా జరిగే తీరు. పిల్లలకు కోట్లు ఇచ్చి తల్లి తండ్రులు ఆశ్రమం లోకి రావాల్సిన పరిస్థితి. పిల్లలు ఉన్నా, భార్య లేకపోయేటప్పటికి మనిషి ఒంటరిగా మిగిలి వృధ్ధ ఆశ్రమాలను ఆశ్రయించక తప్పదు. అది తప్పుకాదు మరీ కొంత మందికి ఇది ఆశ్రయం అవుతుంది.
భారతీయ వివాహ వ్యవస్థ కొంత విదేశీ వ్యామోహంతోను, కొంత కట్న వ్యవస్థ తోను ఆడపిల్లల జీవితాలపై ప్రభావితం అయి తల్లి తండ్రులు వ్యథ చెందుతున్నారు. కొత్త కోడలిని ఆంక్షలు పెట్టీ, భర్త చేత భయ పెట్టించి జీవితాలతో ఆడుకునే వాళ్ళ వల్ల; కొంత మంది చెప్పిన మాటలు, మరికొన్ని విని వాళ్ళ పిల్లలు ఎదిగి వచ్చేటప్పటికి వృద్ధులను ఆశ్రమంలో పెట్టే వాళ్ళు కొందరు. భర్త, అత్త భాధలు పడలేక పిల్లల్ని కూడా వాళ్ళకి వదిలేసి ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు కొందరు. నేటి క్లిష్ట పరిస్థితిలో కుటుంబ వ్యవస్థని కాపాడే బాధ్యత అందరిపై ఉన్నది.
ఆదరణ, ఆప్యాయత, అనురాగం, అభిమానం, ఆత్మీయత వీటికోసం పరితపిస్తున్న వ్యక్తులు ఎందరో. కోడల్ని ప్రేమగా చూసి, కొడుకుల్ని పెద్దరికంగా చూసి తండ్రి తరువాత తనయుడు అన్న సహృదయంతో ఇంటి వ్యక్తుల పట్ల పెద్దల ప్రవర్తన ఉంటే బాగుంటుంది. ఈ ఆశ్రమ జీవన సరళిని పరిశీలిస్తే ఎన్నెన్నో విషయాలు అవగాహన అవుతాయి.
ఆశ్రమాలు నడపడం, అందులో అందరితో కలసి ఉండటం అంత తేలిక కాదు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని వారికి ఒక ఆశ్రయం కల్పించాలని మంజీర నదిలా ఉరకలు వేస్తూ సమాజానికి ఆదర్శ మహిళగా కలెక్టర్ నుంచి జిల్లా అవార్డ్స్, ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర అవార్డ్స్ పొందింది. చతుర్వేదాల్ల నలుగురు మధ్యన పుట్టిన మంజీర చెల్లెలు సహకారంతో ఎందరి జీవితాలకో వెలుగు నిచ్చింది.
పిల్లలు పండుటాకులను తొక్కుతూ చప్పుడు చేస్తూ, బాదం కాయలు రాళ్ళు పెట్టి కొట్టి మరీ పప్పులు తింటున్నారు.
ఓ బాదం చెట్టు, ఓ ఉసిరిచెట్టు, ఓ గోరింట చెట్టు, ఓ కాడ మల్లి. ఇవన్ని మానవ జీవితాన్ని విభిన్న కోణాల్లో చూపిస్తూ ఆదర్శంగా ఉన్నాయి. కమ్మని పప్పులు, పుల్లని కాయలు, ఎర్రగా పండే ఆకులు, సుగంధ పరిమళ పుష్పాలు మన జీవితానికి సేవా పరిమళ ప్రభావితాలు కదా అనుకుంది అన్నపూర్ణ.