[dropcap]రె[/dropcap]పరెపలాడే ముచ్చటైన మూడు రంగుల జెండా
దేశభక్తినే నింపుతున్నది గుండెల నిండా ॥రెపరెప॥
పాడిపంటలతో మన దేశం
ధనాల రాశులు నిండిన కోశం
శాంతి సౌఖ్యం సమరస భావం
సమత మమత మన సందేశం ॥రెపరెప॥
సాగర పరివృత భారతం
హిమవన్నగాలే మకుటం
పచ్చని పొలాలే పచ్చల పతకం
వీర జవానులే రక్షక కవచం ॥రెపరెప॥
ఎన్ని విపత్తు లెదురైనా
ఒకే మాటగా, ఒకే బాటగా
చేయి చేయి కలిపి నడవడమే ఆత్మీయత
భాయీ భాయని కలిసి గడపడమే భారతీయత ॥రెపరెప॥