[dropcap]గా[/dropcap]లికి గంధం పూసే….
సుమవనంలా ప్రతి వేకువలో
నిత్యనూతనంగా ప్రభవిస్తూ
మనసు పరిమళాలు పంచినందుకు…,
వెన్నెల సోన గా
అక్షరాలు కురిపించి……
వల్లరిగా సాగి పాఠకజనమనో తరువులనల్లుకున్న
కవితా మాధురి నాదైనందుకు,
వేల అడుగుల ప్రయాణం లో…
ఏవో కొన్ని జాడలనైనా..
కొందరికి మిగిల్చినందుకు,
పరిచిత హృదయాలలో..
వాసంతాన్నై
చిరునవ్వు ల పరిచయంగా
మిగిలినందుకు
నా జీవన గీతంలో
మరణం చివరి చరణం కాదు!