[dropcap]అ[/dropcap]లీన ఉద్యమ నిర్మాతకు వందనం
బాలల తారకు, శాంతిదూతకు వందనం
వారి పుట్టిన రోజు, మాకు పండుగ రోజు ॥అలీన॥
ప్రకృతి ఆరాధనలో తరించినాడు
ప్రజాసేవలో పల్లవించినవాడు
పువ్వులలో నవ్వుగా
పిల్లలలో పువ్వుగా
పరిమళించిన నేతకు వందనం
పరవశించిన తారకు వందనం ॥అలీన॥
మతాతీత రాజ్యాంగమే మతమన్నాడు
ప్రణాళికలతో ప్రగతికే బాట వేశాడు
నవ భారత విధాతగా
దేశ సౌభాగ్య ప్రదాతగా
విలసిల్లిన నేతకు వందనం
వెలుగొందిన తారకు వందనం॥అలీన॥
ఆధునిక దేవాలయ రూపశిల్పి వాడు
ఆదర్శ చరిత్రకారుడిగా నిలిచినాడు
సమసమాజ సృష్టికర్తగా
భావితరాలకు క్రాంతదర్శిగా
అలరారిన నేతకు వందనం
ఇల నిలిచిన తారకు వందనం ॥అలీన॥