పివి మొగ్గలు

0
3

[box type=’note’ fontsize=’16’] జూన్ 28 న పివి శతజయంతి సందర్భంగా మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి.నరసింహారావుపై కవిత అందిస్తున్నారు డా. భీంపల్లి శ్రీకాంత్. [/box]

~
[dropcap]ప్ర[/dropcap]పంచదేశాలతో విశేషమన్ననలను సఖ్యతగా పొందుతూ
విశ్వాసపాత్రుడిగా అందరికీ తలలో నాలుకైన విధేయుడు
విదేశాంగశాఖకు వన్నెలద్దిన మేధోసంపన్నుడు మన పివి

దేశంలో రాజకీయ నాయకత్వ అస్థిరత నెలకొన్నప్పుడు
దేశప్రధాని పదవిని చేపట్టి సుస్థిరతను సాధించిన ఘనుడు
సమర్థమైన నాయకత్వ పటిమకు అసలైన నిర్వచనం పివి

పివి మదిలో తొలచి వికసించిన సంస్కరణల బీజాలు
భారతదేశమంతటా పూసిన కల్పతరువుల క్షేత్రాలు
నేటి దేశాభివృద్ధికి ఆధారం పివి సంస్కరణ ఫలాలు

భారతదేశ సమున్నత అభివృద్ధిని ఆకాంక్షించిన నేతయై
దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన పరిపాలకుడు
ఆధునిక భారతదేశాన్ని అవతరింపజేసిన నిర్మాత పివి

విలువైన మాటలను తనదైన శైలిలో చేతలతో చూపించి
అఖిల భారతావనిని అబ్బురపరిచిన అపరచాణక్యుడు
దేశ రాజధానిలో తెలంగాణ వెలుగులు పంచిన ఠీవి పివి

విదేశాంగ విధానంలో సరికొత్త దిశానిర్దేశనం చేస్తూ
తన రాజనీతిజ్ఞతతో కొత్తపుంతలు తొక్కించిన విజ్ఞుడు
విశ్వయవనికపై భారతదేశాన్ని ఠీవిగా నిలిపినవాడు పివి

పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని సంకల్పించి
వాటి పురోగతి కోసం పరితపించిన సంక్షేమ క్రాంతదర్శి
గ్రామీణాభివృద్ధే సమగ్రమైన అభివృద్ధని కాంక్షించిన పివి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here