[box type=’note’ fontsize=’16’] Brendon T. Kasiri రాసిన ‘డార్క్ లైట్’ అనే కథని తెలుగులో అందిస్తున్నారు అత్తలూరి విజయలక్ష్మి. [/box]
[dropcap]న[/dropcap]గరం చీకటి దుప్పట్లో చుట్టి ఉంది. వాన పడడంలో దట్టంగా ఉన్న మబ్బుల వెనక మసక, మసకగా దాగి కనిపిస్తున్నారు చంద్రుడు, తారకలు. నగరంలో కర్ఫ్యూ విధించినట్టు నిర్మానుష్యంగా ఉంది. జనసాంద్రత ఉన్న ప్రదేశాల్లో పవర్ కట్ ఇప్పుడే మొదలయినట్టు కనిపిస్తోంది. దేశ దిమ్మరులకు, దొంగలకు ఇదే మంచి సమయం. వీధుల్లో తిరిగే వ్యక్తి సాధారణంగా రద్దీగా ఉండే ప్రదేశాలను గుడ్డిగా దాటిపోతూ ఉంటాడు.. ఒక దొంగ మరో దొంగ వెనకాల వెళ్లినట్టు. వర్షం పడినా వాతావరణం వేడిగా అనిపిస్తోంది. ఈ సమయంలో కొందరు ఇళ్ళల్లో డిన్నర్ చేస్తూ ఉండచ్చు… కొందరు వరండాలో ఆరోజు జరిగిన విషయాలను చర్చిస్తూ కూర్చుని ఉండచ్చు. తల్లులు ఇంకా ఆఫీస్ నుంచి ఇళ్ళకి రాకపోవడం బాధాకరం. ఈ శుక్రవారం రాత్రి ఈ చీకటిలో ఆమె క్షేమంగా ఇల్లు చేరుతుందని ఆశ.
ముందువైపు కిటికీలో నుంచి బయట కనిపిస్తున్న క్యాండిల్ బంగారు రంగు కాంతి ఇక్కడ, సోలార్ లాంతరు తెల్లటి వెలుతురు అక్కడ. పల్చని పరదాల చాటు నుంచి రెండతస్తుల మేడలు కనిపిస్తున్నాయి. అయినా ఆ భయంకరమైన చీకటిని తరమడానికి ఆ పెద్ద లైట్ కూడా చాలడం లేదు.. బయటకు వెళ్ళకుండా కేవలం నిశ్శబ్దంగా ఇళ్ళల్లో కూర్చుని బయట ప్రపంచాన్ని చూడడమే.
కాడియాస్ లాంజ్ కం డైనింగ్ హాల్లో ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించాడు. ఆ కాంతి ఇంటి లోపల భాగాల్లో వ్యాప్తి చెందుతూ చీకటిని పారదోలడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. కానీ దట్టంగా పరచుకున్న చీకటిని తరమడానికి ఆ కాంతి సరిపోవడం లేదు. కొవ్వొత్తి కాంతి దానిని అరికట్టలేకపోతున్నది. అసాధారణంగా ఉన్న చీకటిని మింగడానికి ఫ్లడ్ లైట్స్ కావాలి. వెయ్యి ఫ్లడ్ లైట్స్ కూడా సరిపోవు. అన్ని ఇళ్ళు అలాగే ఉన్నాయి. వెలుతురు, చీకటి పరస్పరం ఉనికిని చాటుతున్నాయి. వాటి మధ్య ఉన్న భయంకరమైన పోటీ ప్రతిష్టంభన ఉంటుంది. రాత్రి వర్షానికి ముందు తుపాను గాలి వీచింది. ఆ గాలి తెరచి ఉన్న కిటికీ గుండా వీచి మండుతున్న కొవ్వొత్తిని ఆర్పేసింది. చీకటి మిగిలింది.
అతను చదుకోడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ నూనె దీపం కాంతి సరిపోడం లేదు.. చీకటి చీకటిని బెదిరిస్తోంది. అతనికి నిరాశగా ఉంది. ఇంకా ఒకటో, రెండో పుస్తకాలు చదవాలి, రెండు మూవీస్ చూడాలి.. ఒక పైరేట్ పాట తెచ్చుకుని వినాలి. అతను చాలా తెలివైన, చురుకైన గ్రాడ్యుయేట్ అయిన యువకుడు. గడియారం టిక్, టిక్ అని చప్పుడు చేస్తోంది. చీకట్లో ప్రతి శబ్దాన్ని వింటూ, సూక్ష్మమైన విషయాలను గమనిస్తూ చీకటి మీద ఆధిపత్యం వహించి చీకటిని జయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
పక్కన ఉన్న గోడల నుంచి వచ్చే రహస్యాలు వింటూ పులకిస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే తాగుబోతులు కూడా ఆ సమయంలో ఇంట్లో ఉన్నారు. విచిత్రంగా ఉంది. ఈ సాయంత్రం నవ్వుకున్నాడు. ఆ వీధిలోని విదూషకులు చేసే హాస్యం కన్నా తమాషాగా ఉంది. ఉత్తేజపరచే ఆలోచనల నుంచి బయటపడి ఎవరితోనూ మాట్లాడాలన్న మూడ్ లేదు.
ఏం చేస్తున్నావు అని అడిగిన తల్లితో తనేమి చేయడం లేదు అని చెప్పడం అంటే అది అబద్దం చెప్పడం అని అతను బలంగా నమ్ముతాడు. ఇంతకన్నా ఎవరూ ఏమీ చేయరు అని నిర్ణయానికి వచ్చాడు. చేస్తే తోటలో ఏదో పని చేస్తుంటారు, పక్కవాళ్ళలో మాట్లాడుతుంటారు… లేదా సిటింగ్ రూమ్‌లో సోఫాలో చేతిలో రిమోట్ పట్టుకుని దాదాపు పడిపోతున్నట్టు పడుకుని ఉంటారు. వీటన్నిటితో పాటు ఆలోచిస్తారు. అతని మెదడు నెమ్మదిగా అతన్ని వంద సంవత్సరాల వెనక్కి తీసుకుని వెళ్ళింది. ఎప్పటికీ గతంలో ఆ జ్ఞాపకాలను వర్తమానం లోకి తెచ్చుకుంటూ అక్కడే ఉండి పోవాలనిపిస్తుంది. ఆనాటి స్మృతులు తవ్వుకోడం బాగుంటుంది కానీ వాటిని వర్తమానంతో పోల్చుకుంటే విషాదంగా అనిపిస్తుంది.
ఆ విషయాలు భిన్నమైనవి కావచ్చు తనకి కావాల్సినది అతను పొందలేదు…. పొందాలి అనుకున్న దాంట్లో సగం కూడా లేదు, కానీ ఇంకా అతనికి తనకి కావాల్సినది చేసే అవకాశం ఉందని అతని నమ్మకం. ఈస్టర్న్ ప్రావిన్స్ లోని ఎగేగో అనే ఒక సుదూరమైన జిల్లాలో ఉన్న సెయింట్ ఇపిటో హై స్కూల్‌లో ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి గ్రౌండ్‌లో ఆడుకుంటున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉండేది జీవితం… అప్పుడు జీవితంలో ప్రతీది మొబైల్‌లా ఉండేది ఎప్పుడూ కూడా సోమరిగా, దిగులుగా అనిపించలేదు. అయితే అతని అంతరాత్మ గతాన్ని వర్తమానంతో పోల్చద్దు అని చెబుతూనే ఉంటుంది. కానీ ఖాళీగా ఉన్న అతని మెదడు అతను అనుకున్నట్టు తనని రక్షించే ఒక్క చిన్న అర్ధవంతమైన వాక్యాన్ని కూడా నిర్మించలేదు. ప్రతిరోజూ అతను అనుకున్నది చేయడంలో ఫెయిల్ అవుతూనే ఉంటాడు. అతన్ని అతను నిందించుకోవాలో వద్ద అతనికి తెలియదు. అతని మెదడులో ప్రశ్న స్పష్టంగా ఉంది కానీ సమాధానమే అస్పష్టంగా ఉంది. బహుశా అతను అర్థం చేసుకోడానికి దారితీసే విషయాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాడు లేదా ఈ భరించలేని విషయంలో వివరణ కోరుతున్నాడు. ఇంతకు ముందే చేసిన పనుల్లో లభించిన మంచి సమాధానాలు ఇప్పుడు తన సందేహాలకు లభించవు అనుకోవచ్చు. తండ్రి చెప్పిన విషయాల వెనక వేసుకున్న ప్రశ్నలన్నీ క్లియర్‌గా ఉన్నాయి అనుకున్నాడు. ఆ రెండికీ మధ్య ఉన్న భావన చాలా ఉన్నతమైనది.
ఆకాశం వైపు చూస్తున్న అతని కళ్ళ ముందు మబ్బులు పట్టిన ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ మెరుపులు మెరిశాయి. కొన్ని సెకండ్స్ ఆపకుండా ఉరిమింది ఆకాశం. అయినా అతను భయపడలేదు. ప్రస్తుతం నా పరిస్థితి కన్నా భయంకరమైనది ఏది ఉండదు అనుకున్నాడు. రెన్నీ అనే తన పేరు బాగా పని చేసింది అని తెలుసుకోడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అతని విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచడంలో మాట్రెస్ అలసిపోయింది. అతన్ని వాస్తవంలోకి తీసుకురావడానికి అకస్మాత్తుగా ఏదన్నా జరిగితే!
కరెంటు నిశ్శబ్దంగా వచ్చి అతని భయాలను చెదరగొట్టింది. వేగంగా లోపలికి వెళ్ళాడు మూవీ చూడడానికి. మానసికంగా బాగా అలసిపోయి ఉన్నాడేమో ఇప్పుడు ఇంకా చదవాలని లేదు. DSTV సబ్‌స్క్రిప్షన్ ఎక్స్‌పైర్ అయి కూడా చాలా రోజులైంది. ఇప్పుడున్న వినోద కాలక్షేపం ఫిలిప్స్ డివిడి ప్లగ్ లేని వైర్లలో ఉంది. Hotel Rwanda అనే మూవీ ప్లే చేయడానికి ప్రయత్నించాడు కానీ డిస్క్ మీద గీతలు పడి పాడైంది. నెమ్మదిగా రిమోట్ కంట్రోల్‌లో ఓపెన్ బటన్ నొక్కాడు. నెమ్మదిగా పాత సిల్వర్ కలర్ టివి స్టాండ్ దగ్గరకు నడిచి CD ఇన్సర్ట్ చేసే ట్రే బయటకి లాగాడు. ఇప్పుడు Game of Thrones ప్లే చేయాలని నిర్ణయించుకున్నాడు, ఆ game అప్పుడప్పుడు తన స్నేహితుల ఇళ్ళకు వెళ్లి చూసేవాడు కాబట్టి అది కాస్త ఊపిరి తీసుకోనిస్తుందని నమ్మాడు. దానివలన ఇతరుల కంపెనీని ఆస్వాదించడానికి దోహదం చేసింది ఇతర ఆలోచనలను దరి చేరనీయకుండా.
దురదృష్టం మళ్లీ పవర్ పోయింది.. ఇంక ఇప్పుడు అతనికి విసుగొచ్చింది.. నేరుగా బెడ్ మీదకు వెళ్లి పడుకున్నాడు. అతను చేయవలసిన మరో పని చదువుకోడం… అయితే అది కేవలం హాబీనే కానీ ఆబ్లిగేషన్ కాకపోవడం ఒక విధంగా మంచిది.
మరునాడు ఉదయం త్వరగా నిద్రలేచి ముందుగా తన గాలక్సీ శామ్సంగ్ ఫోన్‌ని యాక్టివేట్ చేశాడు. కరెంట్ లేకపోయినా తను నిద్రలో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ వస్తుందేమో అని రాత్రంతా ఛార్జి పెట్టి ఉంచాడు. ఇప్పుడు అది పూర్తిగా ఛార్జ్ అయి ఉంది. చెల్లెళ్ళతో దెబ్బలాడుతూ అస్తమానం ఇంట్లో ఉండడాన్ని అతను ఇష్టపడడు. బయటకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.
“హేయ్ నువ్వా! కళ్ళు కనిపించడం లేదా, నీటుగా ఉన్న ఫ్లోర్ మీద నీ మురికి పాదాలు పెట్టి తొక్కడానికి. దేవుడి దయవలన ఒకళ్ళు ఉదయాన్నే ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారు” అతని పెద్ద చెల్లెలు అయాండా హాల్లోకి వచ్చిన అతన్ని చూసి గట్టిగా అంది.
“నా కాళ్ళు మాట్ మీద శుభ్రంగా తుడుచుకున్నా ఇక్కడికి వచ్చే ముందు” ఆమెతో గొడవపడడం ఇష్టం లేని రేన్నీ నమ్రతగా అన్నాడు.. అతనికి ఆ విషయంలో ఎలాంటి వాదనలు చేయడం ఇష్టం లేదు.
“అది ఎండిపోయింది, నీ కంటికి కనిపించడంలేదా” అతని సమాధానం పట్టించుకోకుండా మళ్ళీ అంది.. ఆమె మాటలు రెచ్చగొడుతున్నట్టుగా ఉన్నాయి.
అతను అసహనంగా “ఈ ఇంట్లో నుంచి ఒకళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ ఇంట్లో బరువు కొంచెం తగ్గుతుంది” అన్నాడు.
ఇరవై ఐదు సంవత్సరాల ఆయాండా స్నేహితులు అందరికీ పెళ్ళిళ్ళు అయాయి.. బ్రేక్ అప్ కూడా అయింది. ఇప్పుడు వాళ్ళంతా తండ్రి లేని పిల్లల తల్లులు. రేన్నీ తరచూ వాళ్ళ సోదరి కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని ఆ ఇంట్లో కొంత బరువు తగ్గుతుందని అనుకుంటాడు.
అతను ఫోన్‌లో డేటా ఆన్ చేసి బెడ్ మీద తలగడ కింద పెట్టి వెళ్ళాడు. సింక్ కింద ఉన్న బకెట్‌లో నుంచి నీళ్ళు తీసుకుని అతను టాయిలెట్‌గా పిలుచుకుని యునిసెక్స్ రూమ్‌కి వెళ్ళాడు. అది చాలా అసహ్యంగా భరించలేని దుర్గంధంతో నిండి ఉంది. తప్పని సరి అయి, ముక్కు మూసుకుని కాలకృత్యాలు తీర్చుకోడం కోసం అక్కడికే వెళ్ళాడు. గీజర్ పని చేయడం మానేసి చాలా కాలమైంది. అతను తొమ్మిదో ఏట ఉన్నప్పుడే పాడైంది. ఇప్పుడు స్నానానికి నీళ్ళు వేడి చేయడానికి ఎలక్ట్రికల్ స్టవ్ వాడితే కరెంటు బిల్ చాలా వస్తుంది. టారిఫ్ పెరగడం మామూలు విషయం కాదు. అందుకే వాళ్ళ అమ్మ ఎప్పుడో గ్యాస్ చాలా ఖరీదు అని పారాఫిన్ స్టవ్ వాడుతుంది. అది చాలా చిన్నది అయినా.. వాళ్ళ దగ్గర కట్టెల పొయ్యి లేదు కారణం రెండు… ఒకటి వాళ్ళు ఉన్న ప్రదేశంలో కట్టెలు అమ్మడానికి అనుమతించరు.. మున్సిపల్ పెట్రోలింగ్ పోలీస్‌లు, ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ వాళ్ళు అభ్యంతర పెడతారు. పైగా వాళ్లకి ఆ దేశంలో గ్రామాల్లో ఎక్కడా కట్టలు లేవు లభించడానికి. ఆ పరిస్థితుల్లో రెన్నీ ఏడాది పొడుగునా పడిశంతో బాధపడుతూనే ఉంటాడు చల్లనీళ్ళతో స్నానం చేయడం వల్ల.
స్నానం పూర్తి చేసి షార్ట్ తొడుక్కుని తిరిగి రూమ్‌కి వచ్చాడు. చవకబారు మాయిశ్చరైజర్ ఒంటికి రాసుకుని విరిగిన అద్దం ఒకటి తీసుకున్నాడు. అద్దంలో జాగ్రత్తగా తన విదేశీ స్టైల్ క్రాఫ్, మొహం చూసుకుని సంతృప్తి పడ్డాడు. ఇదే మొదటిసారి అతను తన డ్రెస్సింగ్ పట్ల ఇంత శ్రద్ధ తీసుకోవడం. ఆఖరిసారి నల్లని జీన్స ప్యాంటు మీద తెల్లని టీ షర్టు బ్లూ కాలర్, మోచేతుల వరకు ముదురు స్ట్రిప్స్ ఉన్నది వేసుకున్నాడు.
బ్రాయిలర్ దగ్గర అమ్మాయిలూ ఊడుస్తున్నారు. రెన్నీ అక్కడికి వెళ్లి కొన్ని కోడిగుడ్లను తీసుకుని రూమ్‌కి వచ్చాడు. ఫ్లోర్ పోలిష్ వలన అతని పాదాలు ఎర్రగా అయాయి. అతను నల్లని పెద్ద కట్ ఉన్న షూస్ అడుగు భాగం తుడుచుకుని, తొడుక్కుని కిచెన్ వైపు వెళ్ళాడు బ్లాకు కాఫీ చేసుకోడానికి. క్రితం రోజు సాయంత్రం తండ్రి తినగా మిగిలిన రెండు బ్రెడ్ ముక్కలు ఉన్నాయి తినడానికి.
తను రిఫ్రెష్ అయిన తరవాత చెల్లెళ్లకి బయటకు వెళ్తున్నట్టు చెప్పి వీధిలోకి వచ్చాడు. రాత్రంతా కురిసిన వానకి వాతావరణం చల్లగా ఉంది. బాగా ఇరుకుగా, శిథిలావస్థలో ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు మినీ బస్సు కోసం. అతను అక్కడ అడుగుపెట్టిన కొద్ది నిమిషాలకే మరి కొందరు వచ్చారు. వాళ్ళ వేషధారణ, చెవుల్లో ఇయర్ ఫోన్స్ చూస్తుంటే వాళ్ళంతా నగరంలో ఉన్న ఒక మాదిరి స్థాయి ఉన్న షాపుల్లో సేల్స్ గర్ల్స్ అని తెలుస్తోంది. ఒక whatsapp కాల్ రావడంతో అతను తన ఎడమ చేయి పాకెట్ మీదకు పోనిచ్చాడు. పక్కన ఉన్న అమ్మాయి తనని తన చేతికి ఉన్న గోల్డెన్ వాచ్ చూడడం కోసం స్టైల్‌గా ఫోన్ తీసాడు. అవతల నుంచి తన స్నేహితుడు టినో స్వరం వినిపించడంతో ఉత్సాహంగా మాట్లాడడం మొదలు పెట్టాడు.
“హలో బ్రో” అన్నాడు అతని స్వరం ఇప్పుడు తను గడుపుతున్న జీవితం కన్నా ఇంకా గొప్ప జీవితం గడుపుతున్నాను అన్న భ్రమని కలిగించేలా ఉంది.
“మార్నింగ్ చాప్.. నువ్వు వస్తున్నావా?” అవతల నుంచి వినిపించింది ఒక స్వరం.
“నేను ఆన్ ది వే ఉన్నాను” రెన్నీ ఆలస్యానికి చింతిస్తున్నట్టుగా అన్నాడు.
“సరే త్వరగా రా” టినో చాలా మామూలుగా, పెద్ద ఆలస్యం అవలేదు అన్నట్టు అన్నాడు.
“ఓకే థాంక్స్. కాసేపట్లో నీ దగ్గర ఉంటాను… కొంచెం ఓర్పుగా నువ్వు ఉంటే సంతోషిస్తాను” అన్నాడు. అలా అనడంలో ఒక వ్యక్తి తనకోసం ఎంతో ఎదురుచూస్తున్న భావం ఎదుటివారిలో కలిగేలా ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది.
ఇంతలో ఒక మినీ బస్సు వచ్చింది. కాసేపట్లో టౌన్‌కి వెళ్ళాడు. బస్ దిగి వేగంగా ఎవరో తోస్తున్నట్టు సిటీలో ఉన్న సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌కి వెళ్ళాడు అక్కడ విపరీతంగా రద్దీగా ఉంది. అయినా అతను ఏమాత్రం ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నడిచాడు.. స్మశానం నిశ్శబ్దం కన్నా ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్న Dirough Avenu లోకి ఎలాంటి అలికిడి లేకుండా ప్రవేశించాలని కాదు. అక్కడ కొన్ని కుక్కలు ఎలక్ట్రిక్ ఫెన్సస్ వెనకాల విరిగిన అద్దంలో నుంచి రెన్నీ వైపు చూస్తూ ఉన్నాయి.. అవి కేవలం పక్షుల కలకలంతో పాటు పరిచితమైన అలికిడిని మాత్రమే గుర్తిస్తాయి. అందుకే అతను చప్పుడు చేయకుండా మెయిన్ గేటు వద్దకు వెళ్ళాడు.. ఓనర్స్ అతన్ని గుర్తించి తోటమాలిని అతనికి సాయంగా పంపిస్తారు కుక్కలనుంచి రక్షించడానికి. అతను టినో రూమ్ లోనికి ప్రవేశించాడు.. అతను ఇంకా బెడ్ మీద పడుకుని ఉన్నాడు.
“అందరూ వచ్చేసి ఉంటారు.. మీరంతా వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు అనుకున్నా” అన్నాడు రెన్నీ, బయటకు వెళ్ళే ఉద్దేశ్యం లేనట్టు ఇంకా పడుకునే ఉన్న టినోని ఆశ్చర్యంగా చూస్తూ.
“పిచ్చివాడి పుట్టిన రోజు అంటే అది ఫూల్స్ డే” టినో నవ్వి అన్నాడు. “వాడు వచ్చే లోపల అందరూ ఇక్కడ కలవాలని అనుకున్నాము, వాడికి గట్టిగా సర్‌ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్…”
“మంచి ఐడియా అది” కింగ్ సైజు బెడ్ మీద కూర్చుంటూ అని “అమ్మాయిల సంగతి ఏమిటి” అడిగాడు రెన్నీ.
“వాళ్ళు మనతో జాయిన్ అవుతారు” అన్నాడు టినో తన ఎదురుగా ఉన్న లాప్‌టాప్ మీద మౌస్‌తో కదుపుతూ.
“నేను ఒక విషయం చూస్తున్నాను కానీ దొరకడం లేదు.. అది నువ్వు ఎప్పుడూ చూసి ఉండవు.. తప్పకుండా నీకు నచ్చుతుంది.. డెస్క్‌టాప్ ఆన్ చేసి Bitten కోసం వెతుకు … అది మంచి ఎంటర్‌టైన్మెంట్ సిరీస్..”
మానిటర్ పనిచేయకపోవడంతో “స్విచ్ ఆన్‌లో ఉందా” అడిగాడు రెన్నీ.
“నాకు గుర్తులేదు.. చెక్ చేయి” అన్నాడు టినో హుషారుగా.
“ఇంతకీ ఎవరు వస్తున్నారు.”
“ఫీ ని రమ్మని చెప్పాను.. ఎక్కడికి రావాలో నేను చెప్తానని ఎదురుచూస్తోంది.. ముగ్గి దారిలో ఉంది.. స్కూల్ నుంచి వస్తోంది. టియాక్రా అవుట్ అఫ్ కంట్రీ…. మిగతా వాళ్ళు వస్తుండవచ్చు… మరి నువ్వు?”
టినో చెప్పబోతూ గట్టిగా నవ్వి “నీకు రాణి తెలుసా! మేడం వాళ్ళ బాస్..”
“Theo”
“అవును… Theo”
“నువ్వు జెన్నిఫర్ గురించి చెప్తున్నావు అనుకున్నా.” అతను నవ్వి అన్నాడు
“నువ్వో పిచ్చోడివి.. అయినా ఏం జరిగిందో నాకు గుర్తు చేసావు.”
“కానీ మీరు పెళ్లి చేసుకోబోతున్నారనే అనుకున్నాను” అన్నాడు రెన్ని.
“అలాంటిది ఏమి లేదు..” అని “ఏంటి ఆ మూవీ నీకు కనిపించలేదా!” వంకరగా నవ్వాడు టినో.
“నాకు దొరికింది… ఫస్ట్ ఎపిసోడ్ పెడుతున్నా”
“గుడ్… నేను స్నానం చేసి వస్తా నువ్వు చూస్తూ ఉండు” ఈ మాటలు అని టినో లాప్‌టాప్ క్లోజ్ చేసి గదిలో నుంచి వెళ్ళిపోయాడు.
వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. సామాజిక తేడాలు అనేవి లేకుండా అనేక విషయాలు షేర్ చేసుకుంటారు నాలెడ్జ్, వసతి, రహస్యాలు ఇలా ఎన్నో పంచుకుంటారు. రేన్నీ ప్లే చేసిన మూవీ మొదలు అవకుండానే మరో ఇద్దరు మిత్రులు ప్రవేశించారు. వాళ్ళల్లో ఒక యువకుడు కార్‌లో వచ్చి బయట పార్క్ చేసాడు.. మిగతా ఇద్దరూ టాక్సీలో వచ్చారు. వాళ్ళందరూ ఒకరి భుజాలు ఒకరు ప్రేమగా తడుముకుని, చేతులు కలుపుకుని వాళ్ళ ఆనందాన్ని పంచుకున్నారు. మరో కలయిక అది. గతవారం కలుసుకున్న ఒక వ్యక్తి గురించి జోక్స్ వేసుకుంటూ, నవ్వుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అది రేన్నీకి ఇబ్బందిగా ఉంది. కారణం అతను సినిమా చూడలేకపోతున్నాడు.
ఈ లోపల టినో స్నానం ముగించి వచ్చి గోడకు తగిలించి ఉన్న రెండు మీటర్ల పొడుగాటి అద్దంలో తనని తానూ చూసుకున్నాడు. పెద్ద టవల్ చుట్టుకుని తన గదిలోకి వెళ్ళాడు. అతని డ్రెసింగ్ టేబుల్ మీద ఖరీదైన పెర్ఫ్యుమ్స్, లోషన్స్, ఇంకా అనేక రకాల కాస్మెటిక్స్ జర్మనీ నుంచి ఫ్రెంచ్ నుంచి తెప్పించినవి ఉన్నాయి. ఒక ఆరంజ్ బాటిల్ మూత తీయగానే ఒక తీయటి సుగంధం గదినిండా వ్యాపించింది. హుందాగా తయారై తెల్లని అవుట్ ఫిట్ తెల్లని స్నే అకేర్స్ వేసుకున్నాడు. అద్దంలో చూసుకున్నాడు. గ్రాండ్‌గా ఉంది తన డ్రెసింగ్ అనుకుని తల పంకించాడు. టినోకి వీకెండ్ అంటే పార్టీ. మిగతా రోజుల్లో పని చేస్తాడు అనుకుంటే ఒట్టిదే ఏమి చేయడు ఎంజాయ్ చేస్తాడు. తనకి కావాల్సిన ప్రాధమిక అవసరాలు అన్నీ ఉన్నాయి. అందమైన ఇల్లు, సిల్వర్ మెర్సిడెస్ కారు ఇండోర్ పార్కింగ్‌లో పార్క్ చేసి ఉంది..
పెరుగుతూ ఉన్న బాంక్ ఎకౌంటు.. అన్నిటికన్నా మించి అతను బ్రహ్మచారి. ఇంట్లో టైం గడుపుతాడు అంటే పెద్దల కోసం మాత్రమే.
టినో తయారవడం పూర్తి చేసి వచ్చాడు. కోబి సగం మూసి ఉన్న డోర్ తెరిచాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఎవరితో అయితే స్నేహ సంబంధాలు ఉన్నాయో వారిని తిరిగి కలుసుకోడం ఆనందంగా అనిపించింది. పంతొమ్మిది సంవత్సరాల పనిపిల్ల నాలుగో బెడ్ రూమ్ నుంచి వినిపిస్తున్న సందడి విని ఆ ఆనందంలో తనూ పాల్గొనడానికి ఉవ్విళ్ళూరుతోంది.. సంప్రదాయ బద్దమైన హాపీ బర్త్ డే పాట వినిపిస్తోంది. అందరూ పలహారాలు చేయడానికి డైనింగ్ రూమ్‌కి వెళ్ళారు. నాజూగ్గా గాజులా మెరుస్తున్న అందమైన డిజైన్ ఉన్న స్టీలు పాత్రలు.. భోజనం చాలా ఎక్కువైంది పనిపిల్ల కోసం వదిలేసారు. టినో గేటు రిమోట్ కంట్రోల్ తీసుకుని పాంట్ జేబులో పెట్టుకుని తన స్నేహితుల దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు ఇద్దరేసి డ్రైవ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
చిన్న కాన్వాయ్ అవేన్యులో వేగంగా బయలుదేరింది. రోబోల (సిగ్నల్ పడడంతో) ఆగింది. తార్రోడ్డు మీద టైర్స్ కదులుతూ ఉన్న గట్టిగా వినిపిస్తోంది. రోబోలు ఆకుపచ్చ సిగ్నల్ ఇచ్చాయి.. రెన్నీతో కలిసి డ్రైవ్ చేస్తున్న టినో యాక్సిలేటర్ పెడల్‌ని గట్టిగా నొక్కి బెంజ్‌ను స్పాట్ నుంచి కదిలించాడు. అతని వెహికల్‌కి ముందు ఒక ఫాన్సీ బి.ఎం. డబ్ల్యు, టయోటా ప్రీమియో ఉన్నాయి. త్వరలో వాళ్ళు సిటీ లిమిట్స్ దాటి కాకూరు లాడ్జ్ వైపు సాగారు. అక్కడ blondes ని కలుసుకుంటారు.
అక్కడికి ప్రవేశించగానే Happy Birthday అంటూ చాలా స్వరాలూ పాడుతూ వినిపించాయి… వారిలో అమ్మాయిల స్వరాలూ మరింత గట్టిగా వినిపించాయి. ఈ సారి చక్కగా ముస్తాబు అయిన కోబిని పాడు చేయడానికి ఏమి లేదు. అక్కడ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. టేబుల్స్ అన్నీ పర్పల్, బ్లూ, తెలుపు రంగుల బల్బులతో అలంకరించి ఉన్నాయి. బాటిల్సర్ ఓపెన్ చేయడానికి రెండు తాళం చేతులు, కోకా కోలా బాటిల్స్, లండన్ జిన్, అందరూ కులాసాగా కూర్చుని డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కోబి టేబుల్ మీద కూర్చున్నాడు. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా ఉంది. అక్కడ డ్రింక్ చేస్తున్న యువకులని పెద్దవాళ్ళు ఎవరూ హెచ్చరించే అవకాశం లేదు.
అందరూ అక్కడి నుంచి ఆవరణలోకి వెళ్ళే ముందు బహుమతులు ఇచ్చారు. ఒక పెద్ద బ్రాయి స్టాండ్‌లో పొగలు కక్కుతున్న చికెన్, బీఫ్, పోర్క, సాసేజేస్ ఉన్నాయి… ఇన్సులేషన్ బాక్స్‌లలో ఐసు నింపి ఉంది. అందరూ తాగుతూ, నృత్యం చేస్తూ ఖుషీగా గడుపుతున్నారు. డ్రోన్స్ ద్వారా ఆ అకేషన్‌ని వీడియో తీస్తున్నారు బ్రాడ్‌కాస్ట్ చేసేవారు. రెన్నీ యవ్వనంలోకి వచ్చాక మొదటిసారి డ్రింక్ చేస్తున్నాడు. ఈ ఒక్క రోజు చిన్న, చిన్న ఆనందాలు వదులుకోడానికి సిద్ధంగా లేడు. అతని అంకుల్ ఫిలాసఫీ ప్రకారం డ్రింక్ ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసు. ఇప్పుడు అతనికి డ్రింక్ చేయడానికి ప్రపంచంలో ఉన్న అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఈ ఒక్కరోజు తాగితే వచ్చే నష్టం ఏమి లేదు అనుకున్నాడు.. అందరిలా అతనూ ఎంజాయ్ చేయడానికి నిశ్చయించుకున్నాడు.
ఆ ఇంట్లో ఎవరి మాట అంటే గౌరవం ఇచ్చేవాడో ఆయన కెమికల్ ఇంజనీరింగ్ చదివి జర్మనీ వెళ్ళిపోయాడు.. అదే ఆయన్ని ఆఖరుగా చూడడం.. ఇప్పుడు ఆయన మాటలు, డ్రింకింగ్ గురించి ఆయన చెప్పిన విషయాలు గుర్తుకు వస్తున్నాయి. ఆయన డ్రింకింగ్ మీద అనేక ఉపన్యాసాలు ఎంతో చక్కగా ఇచ్చేవాడు. వాళ్ళు అందరూ గొంతులు లిక్కర్‌తో మండే వరకూ వాళ్ళ పూర్వీకులు కోసం డ్రింక్ చేస్తున్నారు. అమ్మాయిలూ పూర్తిగా మత్తు వచ్చేవరకు తాగి ఇళ్ళకి వెళ్ళడానికి తోడుగా వస్తున్న అబ్బాయిలకు వాళ్ళ దూరపు బంధువుల అడ్రస్‌లు ఇచ్చారు. రెన్ని కూడా బాగా తాగి ఇంటికి వెళ్ళేటప్పుడు కారులో వాంతి చేసుకున్నాడు.
అప్పటికీ పోలీసులు తమ విధులు ముగించుకుని వెళ్ళిపోయారు.. సేన్, కోబి కూడా ఇంకా డ్రైవ్ చేయలేకపోయారు. కోబి తన తమ్ముడిని, సేన్ తన కజిన్‌కి ఫోన్ చేసి వచ్చి కార్స్ ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పారు వాళ్ళు టినోతో వెళ్తూ. ఆడపిల్లలు ఎవరూ కూడా పేరెంట్స్ దగ్గరకు వెళ్ళడం లేదు ఈ పరిస్థితిలో. మూడో ప్రపంచంలోని మూడో తరగతి స్త్రీల జీవితం అది.. వాళ్ళు చాలా అబద్దాలు చెప్తారు తల్లి, తండ్రులకి.. అవకాశం వస్తే వాళ్ళు అన్ని రకాల ఆనందాలను పొందుతారు.
తాగిన మత్తులో పిచ్చి, పిచ్చిగా మాట్లాడుకుంటూ అమ్మాయిల గురించి అవాకులు, చెవాకులు పేలుతూ గోల, గోల చేస్తూ మొత్తానికి రాత్రి తొమ్మిది గంటలకి కాడ్యా ఇల్లు చేరారు. ఒళ్ళు మరచి పడి ఉన్న రెన్నీని అందరూ కలిసి మోసుకుని వెళ్లి మంచం మీద పడుకోబెట్టారు. టినో అతని బెడ్ పక్కని ఒక చిన్న గుడ్ బై నోట్ పెట్టి వెళ్ళిపోయాడు. రెన్నీ అక్కలు ఎవరూ నిద్ర లేవలేదు.. ఒక్క ఆయాండా మాత్రం ఆ తాగుబోతు యువకుల అల్లరి, అరుపులు విన్నది తన తమ్ముడిని వాళ్ళంతా లోపలికి తీసుకుని వస్తూ ఉండగా.
మామూలుగా తెల్లవారింది.. రెన్నీ నిద్రలేచాడు.. తనకాళ్ళకి షూస్ ఉండడం చూసి తను అక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాలేదు.. రాత్రి డ్రింక్ హాంగోవర్ భయంకరంగా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు.. అతనికి సిగ్గుగా అనిపించింది.
మంచం మీద అతని పుస్తకాలు చెల్లా చెదురుగా ఉన్నాయి… ఒక బుక్ తెరచి ఉంది.. అందులో యువతీ, యువకులు బొమ్మలు అశ్లీలంగా ఉన్నాయి. అతనికి చాలా మత్తుగా ఉంది. అతనికి వాస్తవానికి, కలకీ ఉన్న తేడా అర్థం కావడం లేదు.. తన చుట్టూ ఏం జరుగుతోంది అన్న విషయం తెలియనంత మత్తుగా ఉన్నాడు. ఒక్కసారి ఫోన్‌లో కాలండర్ ఓపెన్ చేసి రెండు రోజులు గడిచిందా అన్నట్టు చూసాడు. ఒక కంపనీలో రిసెప్షన్ పోస్ట్‌కి వారం రోజులు పని చేసాక అర్హత సాధించాడో లేదో తెలుస్తుంది. అతను తను చేసిన తప్పు గుర్తొచ్చింది. నిజంగా తప్పు చేసానా అనుకున్నాడు.
ఆరోజు మంగళవారం. రహదారులన్నీ A & E కార్పోరేషన్‌లకు దారి తీసిన ముందు రోజు జరిగింది. అతనికి ఉన్న అకాడమిక్ క్వాలిఫికేషన్, స్కిల్స్ మొదలైన సుదీర్ఘమైన రెస్యుమే ని మానవ వనరుల శాఖ లో మేనేజర్ పోస్ట్‌కి. కాకపోతే మేనేజర్ అకౌంటింగ్‌లో బాచిలర్ డిగ్రీ ఉన్న వాడిగా ఇంకా ఆ ప్రైవేటు కంపనీలో HR గా ఉండిపోయాడు ముప్ఫై ఏళ్లుగా. అతనికి చిట్కా ఏమన్నా తెలుసా తనకున్న ప్రెస్టీజియస్ డిగ్రీని, కలర్ ఫుల్ అడ్వాన్స్ లెవెల్ సర్టిఫికేట్ దాచడానికి, అర డజను ‘A’ నుంచి తన సాధారణ లెవెల్ సర్టిఫికేట్ ‘C’కి మారడానికి సాధ్యమా.
అతని ఇంటర్వ్యూ అపారమైనది కాదు గుర్తుంచుకోడానికి. అతను ఎప్పటిలాగే పూర్తి అవగాహనతో ఉన్నాడు. కావాల్సిన స్కిల్స్‌లో వాళ్ళని ఎప్పుడో మాస్టర్స్‌ని చేసాడు. మంచం చివర కూర్చుని తన అపజయాలకు కారణాలు అన్వేషిస్తున్నాడు. అదంతా సమాధానం లేని ఒక చిన్న ప్రశ్నతో క్లుప్తీకరించ బడింది. తన స్నేహితుడు టినోలో అది మరింత సులభం అవుతుంది. అతని కజిన్ ఒక ఇన్సురెన్స్ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన ఎలాంటి ఫార్మాలిటీస్ లేకుండా ఉద్యోగం సంపాదించాడు. స్కూల్ చదువు పూర్తి అయాక యూనివర్శిటీకి వెళ్ళడానికి అతను నిరాకరించాడు. ఎందుకటి అతను కొన్ని సమస్యలను పరిష్కరించి ఉన్నత చదువు చదవడానికి కొంత డబ్బు సేవ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు అతని మనసులో షేక్స్పియర్ రాసిన నాటకం, చాసేర్ రాసిన ఒక కవిత, ఆహాబ్, జేజేబెల్ 1789 ముందు, ఆ తరవాత వచ్చిన గ్రంథాల్లోనిది.
బ్రాంచ్ మేనేజర్‌గా, కావలసిన వృత్తిపరమైన నైపుణ్యత అతనికి లేదు. యజమాని సంస్థ ఫాబ్రిక్ మార్చడానికి చాలా మానిపులేట్ చేసాడు మేనేజరు తన ఉద్యోగం వదులుకోడానికి సిద్ధంగా లేనంత కాలం అతని instructions కి విరుద్ధంగా ప్రవర్తించడం కష్టం అయింది. ఇప్పుడు నిరుద్యోగుల లిస్టులో చేరడం కానీ తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి చౌక రకం బీరు తయారు చేసిన వారి వెంట మేక పిల్లలా తిరగడం ఇష్టం లేదు. కాబట్టి అది అలా ఉండనిద్దాం.
తను మళ్ళీ కలవని అంకుల్ లాగా, రేన్నీ తను ఎప్పుడూ చూడని మామ లాగా, రేన్నీ కూడా దిగులు పడసాగాడు. అతని తెలివి తేటలు అతనికి ఒక మంచి భవిష్యత్తుని ప్రామిస్ చేశాయి.. కానీ దానికి స్పష్టత లేదు. తనలాంటి వేయిమంది కౌబాయ్‌ల లాగే తనని భావించాడు. తెలుపు, నలుపులను వేరు చేయడానికి అగాధం అవసరం లేదు.. ప్రతిచోటా నల్లగానే ఉంది. వేధింపులు నిబంధనలను విధించాయి. కాంతి చీకటిగా మారింది. ఉద్యోగం కోసం తిరిగిన ప్రయాణానికి పెట్టిన ఖర్చుతో ఒక జత షూస్ వచ్చేవి. నష్టపోయాడు. పరిస్థితి అతన్ని క్రుంగదీస్తూ తక్కువ మాట్లాడే స్థితికి తీసుకు వచ్చింది. ఆల్కహాల్ ఆలస్యంగా రుచి చూసాడు అందుకే అతను ఎమోషన్ అయాడు. తాగడం, తాగకపోవడం అన్ని ఒకటే. అతను ఆ ఓడలో ఎక్కడికీ ప్రయాణించని ఒక ప్రయాణీకుడు. నావికుడు ఎంతో నైపుణ్యంతో నౌకను మళ్ళించాడు.
ఆలోచనలలో ఉన్న అతను తన చెల్లెలు సేవ్స్ బ్రేక్‌ఫాస్ట్‌కి పిలవడంతో వాస్తవం లోకి వచ్చాడు.
“ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను నిన్ను… నేనంటే నిర్లక్ష్యమా” కోపంగా అంది.
“సారీ నేను వినలేదు” క్షమార్పణగా అన్నాడు రేన్నీ,
“అబద్దం చెప్పకు… నిన్ను నేను నమ్ముతాను అనుకుంటున్నావా” అని అనేదే కానీ తల నొప్పి అని ఊరుకుంది.
రేన్నీ లాంజ్ లోకి వెళ్ళాడు. కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి.. బట్టర్ రాసిన బ్రెడ్ ఒక చిన్న ముక్క తీసుకుని తిని టీ ఒక సిప్ చేసాడు. కానీ తినాలనిపించక తిరిగి అన్నీ మూతలు పెట్టి ఏదో గొణుగుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చున్న అక్క, చెల్లెళ్ళు ఏదో సంజ్ఞలు చేసుకున్నారు.. అక్క అంది “ఇది అదే” అంది. రెన్నీ తప్ప అందరూ నవ్వారు.
తన స్నేహితుల లాగా తనకి కారు ఉండి ఉంటే అతను పుస్తకాల ద్వారా సంపాదించిన విజ్ఞానానికి గుర్తింపు, అభినందన లభించి ఉండేది. చదువుకుంటున్న రోజుల నుంచీ కూడా టినో నుంచి కాలిక్యులేటర్‌తో తన భావోద్వేగాలను పంచుకోడం నేర్చుకున్నాడు. అది ఇప్పటికీ అనుసరిస్తూనే ఉన్నాడు. అతని గదిలో చిన్న లైబ్రరీ ఉంది.. అందులో చార్లెస్ డికెన్స్, ఎరిక్ బ్లెయిర్ రాసిన నవలలు ఉన్నాయి. విస్తృతమైన పఠనం వల్ల అతనికి ఇతరుల పట్ల వినయంగా ఉండడం బహుశా ఇష్టం ఉండదు.
అతను బాగా అలసిపోయాడు. తలుపులు మూసి యుద్ధం పూర్తి అయిన తరవాత విషాదంగా మారిన సైనికుడి మనసులాగా ఉంది. నిర్వికారంగా బుక్ షెల్ఫ్ వైపు నడిచాడు. పుస్తకం చేతిలోకి తీసుకునే శక్తి లేనట్టు కూలబడి పోయాడు. తను చిన్నప్పుడు ఆడుకున్న టైర్ల లాంటి గతం లోకి మనసు పరుగులు తీస్తోంది. అక్క చెల్లెళ్ళలో ఆడుకున్న ఆటలు.. అనుకరణలు అన్నీ గుర్తిస్తున్నాయి. ఏమైనా జరిగిన విషయాలన్నీ గుర్తిస్తే ఇది అని చెప్పలేని భావన కలుగుతుంది. ఇప్పటిదాకా ప్రతి రోజూ కష్టపడి పని చేయలేదు.. ఒక్క పెన్నీ కూడా సంపాదించలేదు. విందులు ఎంజాయ్ చేసాడు… మంచి బట్టలు కట్టుకున్నాడు.. డబ్బు తనకి ఎలా వచ్చింది అతనికి తెలియదు.. ఇంకా అతను ఆలోచిస్తూ ఉన్నాడు. కొన్నేళ్ళ క్రితం బామ్మతో పంచుకున్న కథ గుర్తొచ్చింది. చేగో పర్వతం పక్కన కోతులు, బాబూన్లు, కుందేళ్ళు కుటుంబం కథ. కుందేలు సాధారణంగా చాలా తెలివైనది.. అందుకే అది ఆహరం కోసం వేటకు వెళ్ళదు. వడ్డించేటప్పుడు ముందు వరసలో కూర్చుని తనకి కావాల్సినంత తిని కడుపు నిండాక కదులుతుంది. అందరూ నిద్రపోయిన సమయంలో పొలాల్లోకి దొంగతనంగా వెళ్లి మొక్క జొన్నలు, గుమ్మడికాయలు దొంగిలించి తెచ్చుకుని ఒక పెద్ద రాయి కింద దాచుకుని ఆహరం దొరకనప్పుడు తింటూ ఉండేది.
అతను అప్పుడు కుందేలు తెలివి చూసి హేళనగా నవ్వాడు. ఇప్పుడు బామ్మ లేదు.. ఆమె ఉన్నప్పుడు జానపద కథలు, ఇంకా అనేక కథలు చెబుతూ ఉండేది. అలా చెప్పడం ఆమెకి చాలా ఆనందంగా ఉండేది. “మేము యవ్వనంలో ఉన్నప్పుడు జుట్టు మృదువుగా ఉండేందుకు ఎలాంటి రసాయనాలు లేవు.. మేము ఎర్రని వేడి లోహాలను ఉపయోగించే వాళ్లము.. మాకు అప్పుడు ఫేస్ పౌడర్ లేదు.. చెరువులలో మొహాలు కడుక్కునే వాళ్లము. మీరు పుట్టకముందే మీ తండ్రి మీ తల్లిని ఉక్కు ఉత్పత్తి కర్మాగారంలో కలుసుకున్నాడు.” ఇలా ఎన్నో విషయాలు.. బామ్మ జ్ఞాపకాలతో అతని మనసు భారంగా మారింది.. ఈ జీవితం బామ్మ ఇచ్చిందే అనుకున్నాడు.
టినోకి కాల్ చేసి గత వారం సూపర్ మార్కెట్‌లో కలుసుకున్న ఏమిలియాని కలుసుకోడానికి వెళ్ళచ్చు కదా అనుకున్నాడు. గత శుక్రవారం ఆమెని డైజెస్ట్ ఫలహార శాలలో కలుసుకున్నాడు. ఆమె కౌంటర్ దగ్గర నిలబడి ఉంది. అతను ఆర్డర్ చేసిన మెనూ చూసి ఆకర్షితురాలు అయింది. నిజానికి ఆ మెనూతో ఆమె రెండు వారాల ఆహరం కోసం బడ్జెట్ వేసుకుంటుంది. అతన్ని చూడగానే అతను నాగరికంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది. అతను ఆర్డర్ చేసిన ఫుడ్ ఆమె దృష్టిలో అది చాలా ఖరీదైనది.. అది చూసి ఆశ్చర్యం వేసింది. ఇద్దరూ పరస్పరం అభినందనలు తెలియచేసుకున్న తరవాత ఆమెని ఎమ్మి అని పిలుస్తారు అని తెలుసుకున్నాడు. ఆ ధ్వని తన పేరు రెన్నీతో కలిసినట్టు అనిపించి మొదటసారి తన పేరు మీద అభిమానం కలిగి ఆమెకి నిజం చెప్పాడు. తనతో కలిసి భోజనం చేయడం ఆమెకి అభ్యంతరం లేదుకదా అని అడిగాడు. అదృష్టవశాత్తూ ఆమె ఒప్పుకుంది. ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్‌కి కూడా తనే బిల్లు పే చేసాడు.
టినో వచ్చాడు. అప్పటికే థియాగోగా మారిన టినోకు ఆమెను పరిచయం చేయడానికి అతను ఇష్టపడలేదు. టినో చేయబోయే వ్యాపారం గురించి అతను చెప్పేముందే తను చెప్పాడు. భోజనం ఎక్కువ అవడంతో ముగ్గురూ నడక ప్రారంభించారు. రెన్నీ నెమ్మదిగా ఎమ్మి వెనకాల తోడుగా కారు దాకా అనుసరించాడు. ఆమె టౌన్‌కి వెళ్ళాలని తనకి చెప్పినట్టుగా వెనక డోర్ తెరచి ముందు తను ఎక్కాడు కారు ఆమె పక్కన కూర్చునే ఆశతో. టినో ఎప్పటిలా తన డ్రైవింగ్ సీట్‌కి వెళ్ళాడు. స్టీరింగ్ తిప్పుతూ సైడ్ వ్యూ మిర్రర్‌లో నుంచి వాళ్ళిద్దరి మీద ఒక కన్ను వేసి ఉంచాడు. వారం మధ్యలో బయటకు వెళ్ళడానికి నిర్ణయించారు. దిగే ముందు వాళ్ళు కాంటాక్ట్ వివరాలు పరస్పరం తెలుపుకున్నారు. ఆమె అతన్ని ఆదివారం చర్చ్‌కి రమ్మని ఆహ్వానించింది. టినో, రెన్నీ ఆమెని ఎఫ్‌బి బాంక్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. ఆరోజుకి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. టినో మాత్రం సోమవారం చేయబోయే పనికి సంబంధిన ఏర్పాట్లలో మునిగిపోయాడు.
ఆదివారం చర్చ్‍కి వెళ్లి ఎమ్మికి తన నిజాయితీ తెలియచేయడానికి నిశ్చయించుకున్నాడు రెన్నీ. ఆరోజు ఆమె ప్రేమ అనే జాక్‌పాట్ గెలవడానికి చర్చ్‌కి వెళ్ళడం చాలా విలువైనది అని భావించాడు. అక్కడ తేనె ఉంది.. మిగతా వాటిలాగే ఆ తేనెటీగల కాటు భరించడానికి సిద్ధపడ్డాడు. ఆదివారం ఉదయం చాపెల్ వెళ్లి ప్రార్థనలో పాల్గొన్నాడు. ప్రార్థన అయిన తరవాత, వెనకాల వరసలో ఎమ్మికి కనపడకుండా కూర్చున్నాడు.
చిత్రం.. ప్రీచర్ ఆఖరి వాక్యాలు అతని మనసుని ఆకట్టుకున్నాయి. తండ్రి చెప్పిన అపజయం అంటే ఏమిటో ఇప్పుడు అర్థం చేసుకున్నట్టు అనిపించింది. సోఫాలో సగం కూర్చుని, సగం నిద్రపోతూ టాక్స్‌మాన్ ఆట ఆడుతున్నప్పుడు, పాత స్కూల్ కంట్రీ మ్యూజిక్‌ను రేగెతో భర్తీ చయడం, అతను తన విద్యనూ స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం, ట్రక్ డ్రైవ్ ద్వారా పెన్షన్ పొందాడన్న నిజం. ఇలా ఎన్నో అతని కళ్ళ ముందు కదలసాగాయి.
తానూ కోల్పోయిన వాటి విలువ అర్థం అవసాగింది. జీవితంలో చదువు అనేది వెన్నెముక లాంటిదని, తన అర్హతలను సుసంపన్నం చేసే శక్తి చదువుకే ఉందని ముఖం మీద కాదని అర్థం అయింది. విలువైన ఎన్నో సంవత్సరాల కాలం కాలవలో విసిరేసినట్టు అనిపించింది. ఎంత సిగ్గుచేటు! అనుకున్నాడు. మనిషిగా మారే వరకూ వివాహం చేసుకోవాలని ఎన్నడూ అనుకోలేదు.. వివాహం అనేది ప్రశ్నార్ధకం కాదు.. కానీ ప్రస్తుతం అతను తన భవిష్యత్తును నిర్ణయిస్తాయని భావించిన మూడు ప్రాథమిక ఎంపికలను ఎదుర్కొంటున్నాడు. అందులో మొదటిది, చదువు కోకుండా గడిపిన కాలం అంతా వెనక్కి వస్తుందని, తల్లి, తండ్రుల కష్టార్జితంపైన ఆధారపడి తిన్నది లేదా రోడ్డు పక్కన చిన్న వ్యాపారం చేయడం..
ఇప్పుడు అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. ఆ చెడ్డ అలవాటులు మానాలని ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
మరునాడు ఉదయం అనుకున్న ప్రకారం ఆమెని ఎందుకు కలుసుకోలేదో వివరిస్తూ మెసేజ్ పెట్టాడు.
ఏదో తపనతో ముప్పై రెండు అంగుళాల ప్లాస్మా టివి ఆన్ చేసాడు. అదృష్టం ఇప్పుడు DS సబ్‍స్క్రైట్ చేసి ఉంది.. అతని కళ్ళు ఆశతో చూసాయి. అతని ప్రాథమిక ఎంపికని ప్రామిస్ చేస్తూ మొదటి దానికి మద్దతు ఇస్తానని వాగ్దానం చేసింది. అంకుల్ శాం కోసం చూసాడు.. తను ఏం చేస్తున్నాడో, ఏమిటో అర్థం కానంత ఆనందం అతన్ని ముంచెత్తింది. దానిని తన రెక్కల చాటునుంచి ఆశగా చూడసాగాడు. ఇది విపత్తుకి ముగింపు కాదు… విషాదానికి ప్రారంభం కూడా కాకూడదని ప్రార్థించాడు.
***
మూలం: Brendon T. Kasiri
తెలుగు: అత్తలూరి విజయలక్ష్మి