జాతర

0
3

[dropcap]ఆ[/dropcap]మె:
జాతరకు పోదామురో, ఈ రేతిరి
జాతరకు పోదామురో – మామ ॥జాతరకు॥
అతడు:
జాతరకు పోదాములే, ఈ రేతిరి
జాతరకు పోదాములే – పిల్ల ॥జాతరకు॥
ఆమె:
పెళ్ళికి కట్టుకున్న – ఆ
గళ్ల సీర నే సుట్టి
తెల్ల పంచె బిగ గట్టి
కళ్ళీ లాల్చి నువ్వు తొడిగి ॥జాతరకు॥
అతడు:
మళ్ళీ వచ్చే ఏడాదికి
పిల్లో పాపో కలగాలని
పళ్ళూ పూలు పట్టికెళ్ళి
గుళ్ళో దేవుని మొక్కుటకు ॥జాతరకు॥
ఆమె:
తల్లోకి పూవుల సెండు
మెళ్ళోకి పూసల దండ
కాళ్ళకు కడియాలు
కొని తెచ్చుకోడానికి ॥జాతరకు॥
అతడు:
తప్పటడుగు లేని – ఆ
తప్పెటగుళ్ళ సప్పుళ్ళు
గంగిరెద్దప్పన్న
సన్నాయి పాట యినటానికి ॥జాతరకు॥

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here