[dropcap]హ్యా[/dropcap]పీ చైల్డ్ – హెల్దీ నేషన్
హ్యాపీ చైల్డ్ – హెల్టీ నేషన్
ముద్దులొలికే బాలలు
అందాల హరివిల్లులు
వారి ఆరోగ్యమే
దేశ సౌభాగ్యమే ॥ముద్దు॥
ప్రతి పలుకు పాల చినుకు
ప్రతి అడుగు ప్రగతి మలుపు
వారి ఆనందమే
జాతి ఐశ్వర్యమే ॥ముద్దు॥
గలగల నవ్వే పిల్లలు
పరిమళాల మరు మల్లెలు
చిలిపి చిన్నారులే
భవితకు బంగారులే ॥ముద్దు॥
బుడి బుడి నడకల బుడతలు
ఎదిరిస్తే మరి పిడుగులు
ఈ జ్ఞాన దీప్తులూ
జగతికే ఆప్తులు ॥ముద్దు॥