[dropcap]రా[/dropcap]రండోయ్ రారండోయ్
అక్షర దీక్షకు రారండోయ్
పలకా బలపం పట్టుకొని
అక్షర దీక్షను పూనండోయ్ ॥రారండోయ్॥
స్వాతంత్ర్య సమరమే
సాక్షరతా ఉద్యమం
సామాజిక చైతన్యమే
సాక్షరతా లక్ష్యం ॥రారండోయ్॥
అరక పట్టే అన్నలు
పలకను పట్టాలి
బండిని నడిపే తమ్ముళ్ళు
బలపం పట్టాలి ॥రారండోయ్॥
ముగ్గులు వేసే ముదితలు
అక్షరాలు దిద్దాలి
నారును నాటే నారీమణులు
పుస్తకాలు చదవాలి ॥రారండోయ్॥
ఇంటింటా ఫలాల నిచ్చే
అక్షర వృక్షం నాటాలి
పచ్చపచ్చని పల్లెలను
పట్టు కొమ్మలుగ మార్చాలి ॥రారండోయ్॥