ఇది నా కలం-4 : పి. సుష్మ

0
3

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

పి. సుష్మ

[dropcap]నా[/dropcap] పేరు పి. సుష్మ, పదవ తరగతి నుండి నేను చిన్న చిన్న కవితలు రాస్తూ ఉన్నాను. అలా రాయడం చిన్నప్పటినుంచే అలవాటు.

ఆ తర్వాత ఇంటర్మీడియట్ హాస్టల్‌లో ఉన్నప్పుడు నాకు ఈ కవితలు రాయడం ద్వారా సాంత్వన దొరికేది, నన్ను నేను మోటివేట్ చేసుకునేందుకు మోటివేషనల్ పోయెమ్స్ రాసేదాన్ని. మా మిత్రులను ఎవరైనా మోటివేట్ చేయడానికి ఆ కవితలు చాలా దోహదపడేవి. అప్పుడు అక్షరానికి ఉన్న బలం నాకు అర్థం అయింది. అప్పుడే నలుగురి కోసం కవిత్వం రాయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అలా రాయడం పుస్తకంలో దాచుకోవడం. అలా ఓ సారి మొట్టమొదటిసారిగా మా కాలేజీ మ్యాగజైన్లో కవిత ప్రచురితమయింది.

ఆ తర్వాత ఇప్పుడు ఎంత మంది కవులు నాకు పరిచయం కావడానికి కారణం మాత్రం సూరేపల్లి సురేష్ కుమార్ గారు. సాహిత్యం విషయంలో మాత్రం ఆయనకు చాలా రుణపడి ఉంటాను. ఈనాడు వారు నిర్వహిస్తున్న ‘కరోనాపై కదనం’ పోటీకి కవిత రాసి పంపించమన్నారు. ఎంతో మంది సీనియర్ కవులు పంపిస్తూ ఉంటారు, నేను రాసేది ఎంత సార్ అని చెప్పినా, ప్రయత్నం చేయడంలో తప్పు లేదని ప్రోత్సహించడం, ఆ కవిత బహుమతికి ఎంపిక కావడం వారం రోజుల పాటు ఫోను కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్ని ఉదయాలు ఒకేలా ఉండవు, బహుమతి వచ్చిందన్న ఆనందం కంటే నేను కూడా రాయగలననే సంతోషం నమ్మకాన్ని కలిగించింది. ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను.

అలాగే సామాజిక సమరసతా వేదిక నిర్వహించిన కవితల పోటీలో ద్వితీయ బహుమతిగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ గారి చేతుల మీదుగా అందుకోవడం మర్చిపోలేని జ్ఞాపకం.

బహుమతులు ప్రతిభకు కొలమానం కాదు కానీ ప్రోత్సాహాం నమ్మకం కలిగిస్తాయి. అలా చాలా కవితలు రాయగలిగాను.

ఈనాడు, సాహితీకిరణం, శ్రీ శ్రీ కళా వేదిక, గోవిందరాజు సీతాదేవి వేదిక, సూరేపల్లి రాములమ్మ, మల్లెతీగ మాసపత్రిక, నవభారత నిర్మాణ సంఘం, కళ పత్రిక, తానా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, తెలంగాణ సామాజిక రచయితల సంఘం, మొదలయిన వారు వివిధ సందర్భాల్లో నిర్వహించిన కవితల పోటీలో బహుమతులు వచ్చాయి.

తెలుగు వెలుగు, సాక్షి, ప్రజాశక్తి, నవతెలంగాణ, నేటి నిజం మెట్రో ఈవినింగ్, సంచిక, నెచ్చెలి, సహరి, విశాలాక్షి, శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక మొదలైన పత్రికల్లో కవితలు ప్రచురితమయ్యాయి.

సూక్ష్మంగా పరిశీలిస్తే సమాధానం లేని ప్రశ్నలు సవాలక్ష సమాజం నిండా ఉన్నాయి. తరానికి తరానికి మధ్య అభివృద్ధి అపోహలో బ్రతుకుతున్నాం. ఆకలి చావులు ఆగలేదు, అంటరానితనం పోలేదు.

ప్రపంచాన్ని మార్చే శక్తి కలానికి గళానికి ఉంది అని నేను నమ్ముతాను. అందుకే అభ్యుదయ కవిత్వాన్ని రాస్తున్నాను. అణచివేతను, నియంతృత్వాన్ని, ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలను ఏ ప్రభుత్వాలు, సామ్రాజ్యాల వల్ల మార్పు జరగలేదు. అవన్నీ అన్ని కలాలు కలిసి గళం విప్పి గర్జస్తేనే మార్పులు వచ్చాయి.

సాహిత్యానికి, అక్షరానికి అంత శక్తి ఉంది కాబట్టే నేను రాయడానికి అమితంగా ఇష్టపడతాను.

వెనుకబడిన ప్రాంతాల్లో కానీ జాతులలో వంటి వారి జీవితాలలో సాహిత్యం కచ్చితంగా వెలుగును చూపుతోందని నమ్ముతాను.

అక్షరం లక్ష మెదళ్ల చైతన్యం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కవిత్వం రాస్తున్నాను.

సాహితీ శిఖరం వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులైన కిరణ్ విభావరి, అనిలా, వెంకటేష్, అరుణ్ కుమార్ అలూరి, రవికాంత్ శర్మ, స్వప్న, స్ఫూర్తి, శ్రావణి, రేఖా, జ్యోతి గార్ల ప్రోత్సాహం మర్చిపోలేను.

psreddy9959@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here