[dropcap]ఆ[/dropcap]కాశంలో రోడ్డు వేస్తున్నారా…
నల్లని తారు మబ్బులు పరచి
రోలరు నడిచినట్లు ఉరుములు
గుర గురమని వినిపిస్తున్నాయి
కొత్తరోడ్డు మీద నీరు జల్లినట్టు
వాన జల్లు కురుస్తోంది కూడా
ఇంతకీ ఎవరా ఇంజినీరు
లంచాలు గాని తిన్నాడా
మబ్బురోడ్డు మరుసటి రోజుకి
మరి లేదే, ఆకాశాన ఏ కోశానా
రహదారి కనిపించటం లేదే
గ్రహదారిలో రహదారులు ఉండవేమో
ఎందుకైనా మంచిదని ఆలోచించి
ఆకాశానికి నిచ్చెన వేసి ఓసారి
చూసొస్తే పోలా అనుకొని నేను
నిచ్చెన కోసం వెతుకుతున్నా…