[dropcap]అ[/dropcap]ప్పుడు…… మౌనమంటే నాకెంతో ఇష్టం.
ఎందుకంటే నువ్వు ఆ మౌనంతోనే నాపై
నీ మమతల మణులను రువ్వావు.
గానమంటే నాకెంతో ఇష్టం.
ఎందుకంటే నువ్వు ఆ గానంతోనే
నీ ఎదలోని వలపులను తెలిపావు.
విరహమంటే నాకెంతో ఇష్టం
ఎందుకంటే నువ్వు ఆ విరహంలోనే
నన్ను అర్ధం చేసుకొని దగ్గరయ్యావు.
ఇప్పడు…. (నువ్వు నన్ను చేరిన కొన్ని రోజుల తరువాత)
నీ మాటల తూటాలు
మౌనమంటే నాకున్నఇష్టాన్ని పేల్చివేశాయి.
నీ గొణుగుడు,సణుగుడు
గానం అంటే నాకున్న ఇష్టాన్ని కూల్చివేశాయి.
కానీ, నీఈ వ్యతిరేక వ్యవహారం మాత్రం
కలకాలం నీ విరహాన్నే కోరుకొనేటట్లు చేసింది.