పొత్తాలు

3
3

[dropcap]”అ[/dropcap]న్ని మత పొత్తాలు సదివితినినా”

“ఏమిటికిరా”

“మానవత్వం గురించి, మత తత్వం గురించి తెలుసుకొనేకినా”

“తెలిసినా రా”

“లేదు నా”

“ఇబుడెట్లరా”

“ఇంగా సదువుతానునా”

“ఇంగానా”

“ఊనా”

“ఇట్ల సదవతా పోతే నీలా పిత్తము జాస్తీ అయి నీకి పైత్యము పడుతుందిరా”

“అయ్యో… అట్లనా?”

“ఊరా”

“అయితే నన్ని ఇబుడు ఏమి చేయమంటావునా?”

“ఆ పొత్తాలు సదివేది విడచిపెట్టి మనుషుల్ని సదివేది మొదలుపెట్టరా”

***

నేను అన్న చెప్పినట్టే చేస్తిని.

మనుషుల్ని సదివేది మొదలు పెడితిని.

మనిషి తత్వం, మానవత్వం, మత తత్వం గురించి కూడా బాగా తెలుసుకొంట్ని.

తెలిసి నేనూ అట్లే నడచుకొంట్ని.

కాలం నన్ని చూసి నగే (నవ్వె).

నేను అట్లే కాలంతో కరచాలనం చేస్తిని. “మతాతీతమైన మానవ జాతి వర్ధిల్లాలి” అని అంట్ని.

“అది అయ్యే పనేనా?” ఆ పక్కనింకా ఎవరో అనిరి.

“కాని పని మాత్రం కాదు” అంట్ని.

***

పొత్తాలు = గ్రంథాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here