అనుబంధం

2
4

[dropcap]శ్రీ [/dropcap]ఆర్. వి. వి. రాజా రెక్కలు ప్రక్రియలో ‘అనుబంధం’ శీర్షికన వ్రాసిన ఐదు కవితలని పాఠకులకు అందిస్తున్నాము.
~
1
నది పరిగెడుతుంది మొలకెత్తే
విత్తు ముఖాన్ని చూడ్డానికి
చెట్టు నిలబడిపోతుంది వాలే
పక్షికి ఆలంబనంగా మిగలడానికి

ఒకరిది ఆనందం
మరొకరిది అనుబంధం..

2
బలిసిన కొమ్మలెన్ని ఉన్నా
చెట్టు బతకదు
ఒంటరి వేరు ఒక్కటున్నా
చెట్టు చావదు

అవసరం అంతరిస్తే
అస్తిత్వం ప్రశ్నార్థకమే.

3
ఓటమిని గెలుపుగా
మలచడం ప్రజ్ఞ
గెలుపొటములన్ని సమంగా
కొలవటం స్థితప్రజ్ఞ

ఆట మాత్రమే మన అవసరం
గెలుపోటములు దైవ పరం.

4
నివురు రెప్పలు కప్పినా
నిప్పు చేతులన్ని కాలుస్తుంది
కాలం కళ్ళు కప్పినా మనల్ని
మరణం ఏదో రోజు కాటేస్తుంది

ఉన్నది లేదనుకోవడం లేనిది ఉందనుకోవడం
ఇలాగే బతుకుని తడుముకోవడం.

5
కవిత్వం రాయడం దైవత్వం
కవిత్వం చదవడం భక్తితత్వం
కవిత్వంకై బతకటం వీరత్వం
కవిత్వం లోకి మారడం సహజత్వం

కవిత్వంలో జీవించడం
అమరత్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here