[dropcap]భ[/dropcap]వితకు బాటవేసే
శ్రామికుడు
మన కలల సాకారానికి
సాధకుడు
అజ్ఞానాన్ని తొలగించే
సూర్యుడు
విజ్ఞానాన్ని వెలిగించే
చంద్రుడు
తను పుస్తకమై
బోధిస్తాడు
మన మస్తకమై
దారి చూపుతాడు
చదవడానికి
తను లైట్లవుతాడు
ఎదగడానికి
తను మెట్లవుతాడు
మనం ఉన్నత స్థితిలో ఉంటే
పన్నీరై హర్షిస్తాడు
మనం హీన స్థితిలో ఉంటే
కన్నీరై వర్షిస్తాడు