ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 9

0
3

[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.

~

“నీకు మొదటే చెప్పాను కదా, ఏమిటి ఇక్కడ రాయల్ సాఫ్ట్ స్కిల్స్ కాంపస్‌లో వ్యవహారం అంతా కాస్తా వ్యత్యాసంగా ఉంది అని అనుకున్నాను. ఎక్కడైనా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అనేటప్పటికి గ్రామర్ సూత్రాలు, కొన్ని సెంటెన్స్ స్ట్రక్చర్లు చెప్పి, కొన్ని పడికట్టు పదాలు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇలాంటివి ఏదో నాలుగు మాటలు చెబుతారు అనుకుంటే, చేరి మూడు రోజులు పూర్తి కావస్తున్నా మాకు ఇంగ్లీష్ చెప్పటం అనే ప్రసక్తే ఎత్తుకోలేదు.

మూడో రోజు సెషన్‌లో మొదటి సగభాగం మా డ్రీమ్స్, మా గోల్స్ గూర్చి మాట్లాడి, డ్రీం ప్లస్ ఇతర five Ds కలిస్తే గోల్ అవుతుంది అని చెప్పి, ఆ తరువాత స్వాట్ అనాలిసిస్, స్మార్ట్ గోల్స్ గూర్చి చెప్పి, షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్ మరియు లాంగ్ టర్మ్ గోల్స్ గూర్చి చెప్పి, ఇక చివరికి వచ్చేటప్పటికి గోల్స్‌ని ఏ విధంగా విభజించుకోవాలో చెప్పుకొచ్చారు”

రాయల్ సాఫ్ట్ స్కిల్స్‌లో ఏమి చెప్పారో చెప్పటం మొదలెట్టాడు రాజు

***

“మీ గోల్స్ గూర్చే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి మీరు. గోల్స్ అంటే అందరూ అనుకునే విధంగా ఏ జాబ్ చేయాలి అనో, ఎంత డబ్బు సంపాయించాలనో మాత్రమే కాకుండా మీ జీవితాన్ని అన్ని విధాలుగా ఆనందభరితంగా మార్చుకునే విధంగా మీ గోల్స్ ఉండాలి.

‘యూ కెన్ విన్’ అనే గ్రంథ రచయిత శివ్ ఖేరా గారు ఏమి చెపుతారు అంటే “జీవిత పర్యంతం వృత్తి, వ్యాసంగాలు గూర్చి మాత్రమే ఆలోచించి డబ్బు సంపాయించటమొక్కటే పరమ ధ్యేయంగా మలచుకుని వృత్తి పరంగా ఎన్నో శిఖరాలు అధిరోహించిన వారు చివరికి తాము జీవితంలో ఎన్నో కోల్పోయాము అని వాపోయారు. కొందరు ఈ నిరాశ ఎక్కువ అయి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు.

జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది బాలెన్స్. అవునండీ, మీ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని, కుటుంబాన్ని, సామాజిక సంబంధాలని అన్నిటిని సమపాళ్ళలో బాలెన్స్ చేసుకోగలిగినప్పుడే అది నిజమైన విజయం అవుతుంది అంటారు శివ్ ఖేరా.

1923లో ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నులు అయిన ఏడు మంది (స్టీల్ కంపెనీ అధినేత ఛార్లెస్ ష్వాబ్, పెట్రోలియం కంపెనీ అధినేత హౌవార్డ్ హబ్సన్, కొమోడిటీ ట్రేడర్ ఆర్థర్ కుటన్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజి ప్రెసిడెంట్ రిచర్డ్ విట్నే, రాజకీయ వేత్త అల్బర్ట్ ఫాల్, స్టాక్ ట్రేడర్ లివర్ మూర్, వ్యాపారవేత్త ఇవర్ క్రూగర్, బ్యాంకర్ లియోన్ ఫ్రేజర్) జీవిత చరమాంకంలో ఆత్మహత్యలు చేసుకోవడమో, జైలుకెళ్ళటమో, దివాల తీసి చేతిలో చిల్లిగవ్వ లేకుండా మరణించటమో జరిగింది.

నిజానికి 1923లో ఈ ఏడుగురి ఆస్తుల మొత్తం విలువ అప్పటి అమెరికా దేశం యొక్క మొత్తం సంపదకన్నా ఎక్కువ. మరి వీరు అందరూ, ఎందుకు జీవితం చివరి దశలో దారుణంగా విఫలం అయ్యారు అంటే జీవితాన్ని బాలెన్స్ చేసుకోలేకపోవటం.

కాబట్టి మీ జీవితంలో మీరు పూర్ణత్వం పొందాలంటే మీ గోల్స్ ని ఈ క్రింది విధాలుగా విభజించుకోవచ్చు.

1) Personal Mastery Goals

2) Career / Job & Financial Goals

3) Family & Fun related Goals

4) Spiritual Goals

‘సెవెన్ హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్’ పుస్తకం ప్రారంభ వాక్యాలలో స్టీఫెన్ ఆర్ కోవీ గారు ఇదే చెబుతారు. వృత్తి జీవితంలో అత్యంత గొప్ప స్థానాలకు చేరుకున్నఅనేక మంది సీఈవోలు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు కూడా వ్యక్తిగత జీవితంలో ఏదో వెలితిని, అశాంతిని అనుభవిస్తూ ఆయన వద్దకు వచ్చి వాపోయారట.

అందుకే జీవితంలో బాలెన్స్ తప్పనిసరి అని చెబుతూ, నైతిక విలువలతో కూడిన జీవితం మనకు జీవితంలో పూర్తి తృప్తిని ఇస్తుంది అని అదే నిజమైన విజయం అని చెబుతారు. అంటే ఒట్టి ధనం, హోదా సంపాయించటం మాత్రమే కాదు, చక్కటి ఆరోగ్యం, ఒత్తిడి లేని మానసిక స్థితి, చక్కటి కుటుంబ సంబంధాలు, చక్కటి సామాజిక సంబంధాలు ఇవన్నీ ఒక విజేతకి ఉండాల్సిన నిజమైన లక్షణాలు అని చెబుతారు.

ప్రఖ్యాత ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ గారు ఏమి చెబుతారు అంటే మీ జీవితంలో అన్నింటికన్నా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఏమిటి అంటే మీ ఆరోగ్యం. హెల్తీ బాడీ లీడ్స్ టు హెల్తీ మైండ్ అని మనం విన్నాం కదా. కిరణ్ బేడి గారు ఇదే విషయాన్ని చాలా చక్కగా వివరిస్తారు.

ఒక ఉదాహరణ చెబుతూ ఆమె, ఆరోగ్యంగా ఉన్న మిమ్మల్ని 1 అనే సంఖ్యగా భావించుకోండి, అని చెబుతారు. ఇప్పుడు ఆ ఒకటి పక్కన ఎన్ని సున్నాలు జతచేస్తూ పోతే, ఆ ఒకటి విలువ పెరుగుతూ పోతుంది.

1 (ఆరోగ్యంగా ఉన్న మీరు)

ఈ ఒకటి పక్కన ఒక్కొక్క సున్నా పెరిగే కొద్ది, మీ విలువ పెరుగుతుంది సమాజంలో.

10 ( ఈ సున్న మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి గుర్తు గా పెట్టుకోండి)

100 ( ఈ రెండో సున్నా మీ ఎక్స్‌ట్రాకరిక్యులర్ స్కిల్స్‌గా పెట్టుకోండి)

1000 (ఈ మూడవ సున్నా మీ ఉద్యోగం)

10000 (ఈ నాలుగవ సున్నా మీ ప్రమోషన్)

100000 (ఈ ఐదవ సున్నా మీ సంపదలు, ఆస్తిపాస్తులు)

ఇలా ఎన్ని సున్నాలు జత చేస్తూ పోయినా ఆ సున్నాలకు విలువ మీరు అరోగ్యంగా ఉన్నంత సేపు మాత్రమే.

మీ ఆరోగ్యం కాస్తా దెబ్బతిన్నాక మీరు సంపాయించిన అన్ని గుర్తింపులు చివరికి సున్నాతో సమానమై పోతాయి.

ఎంత చక్కగా చెప్పారు చూడండి.

నేను ఎన్నో రోజులనుంచి ఇదే ఆలోచిస్తున్నాను. సినిమా పాటలు చూసేటప్పుడు హీరో, హీరోయిన్లతో పాటుగా కొన్ని పాటల సన్నివేశాలలో వారి వెనుక గుంపుగా కొందరు డాన్స్ చేస్తూ ఉంటారు. వారు నిజానికి ఆరోగ్యంగా ఉంటూ, అందంగా కూడా ఉంటారు. అలాగే కొందరు కార్మికులు బాగా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పటికీ జీవితంలో ఎదుగుబొదుగు లేకుండా కష్టపడి జీవిస్తూ ఉంటారు.

ఇలాంటి వారిని చూసినప్పుడల్లా నాకు బాధనిపించేది. వారు దృఢంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అయినా కూడా వారు జీవితంలో విజేతలుగా ఎదగలేకపోయారు అంటే దానికి ప్రధాన కారణం వారు ఇతర నైపుణ్యాలని నేరుకోకపోవటమే కదా అని. ఇదే విషయాన్ని అనేక సందర్భాలలో విద్యార్థులకు ఉదాహరణగా చెప్పేవాడిని.

నాకు కిరణ్ బేడి గారి మాటలు విన్నాక మీకు ఈ అంశాన్ని సులభంగా చెప్పటంలో ఒక వెసులుబాటు వచ్చింది.

మీరు ఆరోగ్యంగా, దృఢంగా ఉండటం చాలా ముఖ్యం.

అన్నిటికన్నా ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన అంశం. కానీ ఉత్తిగా ఆరోగ్యంగా మాత్రమే ఉంటే లాభం లేదు.

జీవితంలో ఇవన్నీ కూడా కావాలి.

  1. క్వాలిఫికేషన్
  2. స్కిల్స్ (నైపుణ్యాలు)
  3. ఉద్యోగం
  4. డబ్బు సంపాయించే నేర్పు
  5. ఆస్థి పాస్తులు, కారు, బంగ్లా, నగలు, నట్రా
  6. అందరికన్నా ముందంజలో ఉండే నైపుణ్యాలు
  7. మీకు అంటూ ఒక కుటుంబం
  8. పిల్లా పాపాలు
  9. బంధువులు, స్నేహితులు
  10. ఆనందం

కానీ చిత్రమేమిటంటే ఇవన్నీ కూడా మీరు ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నంత వరకే మీకు ఆనందం ఇస్తాయి. ఎప్పుడైతే ఆరోగ్యం లోపిస్తుందో ఇవన్నీ నిష్ప్రయోజనాలు.

ఒకటి పక్కన చేర్చి ఉన్నప్పుడే సున్నాకి విలువ.

ఒకటి పక్కన సున్నాలు చేరితేనే ఒకటికి విలువ.

కాబట్టి మీ గోల్స్ అన్నింటిలోనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన గోల్ ఆరోగ్యం కాపాడుకోవటానికి సంబంధించిన గోల్స్‌కి.

ఆరోగ్యమే మహాభాగ్యం.

కాబట్టి జీవితంలో మీరు ఒక స్పష్టమైన గోల్ మీ ఆరోగ్యం పట్ల ఏర్పరచుకోవాలి. జీవితాంతం మీతో ఉండబోయేది మీ శరీరమే. దానిని సరిగా పరిరక్షించుకోవటం మీ బాధ్యత. దీనికి మీరు ఒక స్పష్టమైన గోల్ ఏర్పరచుకోవాలి.

మీ అరవయ్యవ ఏట మీరు ఎలా ఉండబోతున్నారు, మీ డెబ్బయ్యవ ఏట మీరు ఎలా ఉండబోతున్నారు,, మీకు తొంభయి ఏళ్ళు వచ్చినా మీరు ఎలా ఉండబోతున్నారు, ఇలా మీ ఊహల్లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉత్సాహంగా చక్కగా ఊహించుకోండి.

మీ ఆరోగ్యానికి మొదటి అడుగు ఆరోగ్యకరమైన మీ ఊహలే.

1) Personal Mastery Goals

ఈ సంవత్సరానికి (రాగల 365 రోజులకు) టాప్ టెన్ పర్సనల్ మాస్టరీ గోల్స్.

ఇందులో మీ ఆరోగ్యానికి సంబంధించి, మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్‌కి సంబంధించి, మీరు పూర్తి చేయాల్సిన వ్యక్తిగత లక్ష్యాలను వ్రాసుకోండి.

1 నేను నా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటాను.
2 నేను ఈ సంవత్సరం అయ్యేలోగా ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను
3
4
5
6
7
8
9
10

టాప్ టెన్ పర్సనల్ మాస్టరీ గోల్స్ (వచ్చే అయిదు సంవత్సరాలకు)

ఇందులో మీ ఆరోగ్యానికి సంబంధించి, మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్‌కి సంబంధించి, మీరు పూర్తి చేయాల్సిన వ్యక్తిగత లక్ష్యాలను వ్రాసుకోండి.

మీ జీవితానికి సంబంధించి ప్రతి ఒక్క విషయం మీ ప్లానింగ్‌తో మీరు చక్కగా సాధించగలరు. జీవితం అంటే, ఏదో గాలి వాటుగా నడిచే వ్యవహారం కాదు. పూర్తి పకడ్బందీగా మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించగలరు.

వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే మొదలవుతుంది.

ఇల ప్రతి ఒక్క అడుగుని మీరు చక్కగా ప్లాన్ చేసుకుని, ఆ ప్లాన్‌ని అమలు చేసుకుంటూ పోతే, మీకు విజయం ఎందుకు స్వంతం కాదు.

ఒక విషయం చక్కగా గుర్తుంచుకోండి, ఏదో ప్రవాహంలో పడి కొట్టుకుని పోయినట్టు జీవించేవారు కూడా ముందుకు పోయినట్టే కనిపిస్తారు కానీ వారి జీవితం వారి చేతులలో ఉండదు. జీవితం నడిపించినట్టుగా అయోమయంగా నడుస్తారు, వారి విజయం వారి చేతిలో ఉండదు.

మీకు తెలుసుకదా, ప్రవాహం ఎప్పుడూ పల్లానికే ప్రవహిస్తుంది అని. జీవితం అనే ప్రవాహంలో పడి కొట్టుకుని పోయేవాడు జీవితంలొ గొప్ప విజయాలని సాధించలేడు.

1 నేను నా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటాను.
2 ఈ అయిదు సంవత్సరాలలో ఇంగ్లీష్ మాట్లాడటంలో పూర్తి పట్టు సాధిస్తాను
3
4
5
6
7
8
9
10

టాప్ టెన్ పర్సనల్ మాస్టరీ గోల్స్ (వచ్చే పది సంవత్సరాలకు)

1 నేను నా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటాను.
2
3
4
5
6
7
8
9
10

2) Career / Job & Financial Goals

మీరు సాధించబోయే ఉద్యోగం, మీ పూర్తి కెరియర్ గోల్స్, ఆర్థికపరమైన గోల్స్ మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇవి కూడా ఇందాకట్లాగానే, మొదట ఒక సంవత్సరానికి, ఆ తరువాత అయిదు సంవత్సరాలకు, ఆ తరువాత పది సంవత్సరాల జీవితాన్ని ముందే మీరు చక్కగా ఊహించుకుని, ప్లాన్ చేసుకుని వ్రాసుకుంటూ వెళ్ళండి,

మీ ఉద్యోగ జీవితం, మీ కెరియర్, మీ ఆర్థిక స్థితి మీ చేతిలో ఉంటుంది అని ఎన్నటికి విస్మరించకండి. గాలివాటుగా వెళ్ళే వారి గూర్చి కాదు మనం మాట్లాడుకుంటున్నది.

మీలాగా క్రమశిక్షణ తో కూడిన జీవితాన్ని నిర్మించుకునేవారికి విజయం ఎప్పుడు స్వంతం అవుతుంది.

ఉద్యోగం, కెరియర్, ఫైనాన్షియల్ గోల్స్ (రాగల 365 రోజులకు సంబంధించి)

1
2
3
4
5
6
7
8
9
10

 ఉద్యోగం, కెరియర్, ఫైనాన్షియల్ గోల్స్ (రాగల అయిదు సంవత్సరాలకు)

1
2
3
4
5
6
7
8
9
10

 ఉద్యోగం, కెరియర్, ఫైనాన్షియల్ గోల్స్ (రాగల పది సంవత్సరాలకు)

1
2
3
4
5
6
7
8
9
10

3) Family & Fun related Goals

మీరు కేవలం ఒక మరమనిషిలాగా జీవించకూడదు.

మీకు మీ కుటుంబం, అమ్మనాన్న, తమ్ముళ్ళూ, చెల్లెళ్ళు, పెళ్ళాం పిల్లలు వీరందరూ కూడా ముఖ్యమే.

వీరందరినీ మరచి పోయి ‘నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను’ అని అనుకుని మీరు ఇరవై నాలుగు గంటలు పని పని అని తలమునకలుగా ఒక మర మనిషిలాగా మారిపోతే మీ జీవితం యాంత్రికం అయిపోయి, కొన్నాళ్ళ తర్వాత మీకు ప్రేరణ అనేది లభించక, హృదయంలో ఉల్లాసం ఉత్సాహం అన్నవి కనుమరుగయి, మీ పనిలో కూడా కొత్తదనం లోపిస్తుంది. ఒక విధమైన నిర్జీవిమైన వాతావరణం ఏర్పడుతుంది మీ జీవితంలో.

అందుకే మీరు రాగల సంవత్సర కాలంలో, అయిదేళ్ళలో కాలంలో, రాగల పదేళ్ళ కాలంలో మీ ఇంటికి, మీ వాళ్ళకు ఏమి చేయాలని అనుకుంటున్నారు, ఎలా వారితో సమయం గడపాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే మీ జీవితంలో ఒక విధమైన నిండుతనం వస్తుంది.

టాప్ టెన్ ప్లాన్స్ ఫర్ ఫామిలీ (రాగల 365 రోజులలో మీ కుటుంబానికి, మీ ఆనందానికి ఏమిచేయాలనుకుంటున్నారు )

1
2
3
4
5
6
7
8
9
10

 టాప్ టెన్ ప్లాన్స్ ఫర్ ఫామిలీ (రాగల అయిదేళ్ళలో మీ కుటుంబానికి, మీ ఆనందానికి ఏమిచేయాలనుకుంటున్నారు )

1
2
3
4
5
6
7
8
9
10

 టాప్ టెన్ ప్లాన్స్ ఫర్ ఫామిలీ (రాగల పదేళ్ళలో మీ కుటుంబానికి, మీ ఆనందానికి ఏమిచేయాలనుకుంటున్నారు )

 

1
2
3
4
5
6
7
8
9
10

 4) Spiritual Goals

చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఆధ్యాత్మికత/స్పిరిచ్యుయాలిటీ అంటే ఏదో ముసలి వయసులో ముక్కు మూసుకుని కృష్ణా రామా అనుకుంటూ చేయాల్సిన పని అని. కానీ అది శుద్ధ అబద్దం.

నిజమైన ఆధ్యాత్మికత యువతీ యువకులకు, ఉద్యోగస్తులకు, జీవితంలో పోరాటం చేస్తున్న అందరికీ కావాలి. దాని వల్ల వారికి జీవితంలో విజయం, గెలవటానికి అవసరమిన మానసిక స్థైర్యం, నిబ్బరం వస్తాయి. ఇలాంటి విజేతలకు వృద్ధాప్యంలో నిజమైన నిశ్చింత, ఆనందంతో కూడిన జీవితం సహజ సిద్ధంగానే లభిస్తాయి. ఈ విధంగా మొత్తం జీవితాన్ని హాయిగా గడపవచ్చు.

నిజమైన స్పిరిచ్యుయాలిటీ అంటే, కష్టంలో ఉన్న సాటి మానవులను ఆదుకోవడం, ధర్మ కార్యాలు చేయటం, చేతనైనంతలో ధార్మిక కార్యాక్రమాలలో పాల్గొనటం, మీకు నచ్చిన సేవా సంస్థకి విరాళాలు ఇవ్వటం, వారికి చేదోడు వాదోడుగా ఉండటం.

ఈ విధమయిన కార్యక్రమాల వల్ల మీకు ఒక విధమయిన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అది మీ విజయానికి ఎంతగానో సాయపడుతుంది.

టాప్ టెన్ స్పిరిచ్యువల్ గోల్స్ (రాగల 365 రోజులకు)

1
2
3
4
5
6
7
8
9
10

టాప్ టెన్ స్పిరిచ్యువల్ గోల్స్ (రాగల అయిదేళ్ళకు)

1
2
3
4
5
6
7
8
9
10

టాప్ టెన్ స్పిరిచ్యువల్ గోల్స్ (రాగల పదేళ్ళకు)

1
2
3
4
5
6
7
8
9
10

మీరు ఈ విధంగా పూర్తి క్లారిటీతో జీవితాన్ని ప్రారంభిస్తే మీకు విజయం తథ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here