[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.
~ ~
రామప్ప గుడికి
యునెస్కో ప్రశస్తి
తెలంగాణపు
తెలుగువాడి ఆస్తి –
ప్రపంచ పర్యాటక జడి..
పెరిగేనిక పలుకుబడి!
~ ~
గగనాన మబ్బులు
కమ్మితేనే వర్షం –
సూర్యుడు ప్రకోపిస్తేనే
చలిని తరుము కిరణం –
వెన్నెల కాచేది
చీకటయ్యాకే!
~ ~
ఎగిరితేనే
అందేను ఫలం –
పఠిస్తేనే పుస్తకం
అవగతం –
తిని కూచుంటే
కరిగేది కాలం!
~ ~
కాలంతో బాటు
మారుతూ వచ్చినదే
అవశ్యం అనుసరణీయం –
కానిది కాదు శిరోధార్యం –
నిలవ నీరు
కాజాలదు పానీయం!