[dropcap]”చిం[/dropcap]తజేసిన ఇప్పుడు సిద్దించు పరమ పదవి చింతసేయవే నువ్వు మనసా” – శ్రీ యోగి కైవారం నారాయణ తాతగారు.
***
“మనది భారతదేశం, మనమంతా భారతీయులం కదనా?”
“అవునురా”
“మన దేశములా జనాలెందరు, జాతు లెన్నినా?”
“శానా శానా రా”
“కులాలెన్ని కులవృత్తులెన్నినా?”
“శానా శానా రా”
“పంటలు ఎన్ని, వంటలు ఎన్ని?”
“శానా శానా రా”
“బాస లెన్ని యాసలు ఎన్నినా?”
“శానా శానా రా”
“దేవుళ్లెందరు – గుడులెనిన్నా?”
“శానా శానా రా”
“జానపదులెందరు, గానపదులెందరు, జ్ఞానపదు లెందరు?”
“శానా శానా రా”
“ఇన్ని శానా శానాలా, ఇదేమినా?”
“ఇది మన చరిత్రరా, మన కళాచారం రా, మన ఉనికి రా, మన చింతన శానా శానా రా”.
***
శానా శానా = చాలా చాలా