కోటిన్నొక్కడు పుస్తకంపై సమీక్ష పోటీలు-2021 ప్రకటన

0
3

[dropcap]ఉ[/dropcap]పాధ్యాయ దినోత్సవం సందర్భంగా కోటిన్నొక్కడు పుస్తకంపై సమీక్ష పోటీలు-2021

‘కోటిన్నొక్కడు’ నవల విడుదలైన మొదటి 6 నెలల్లోనే 600 పైచిలుకు కాపీలు అమ్ముడైన శుభ సందర్భంగా, *కోటిన్నొక్కడు పుస్తకంపై సమీక్ష పోటీలు* నిర్వహించి, 6గురు విజేతలను ఎంపికచేసి అక్షరాల 6000 రూపాయల బహుమతులను వారికి అందజేస్తున్నాము.

మీరు సమీక్ష రాయడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. మీకు నచ్చినన్ని పదాలతో, నచ్చినన్ని పేజీల్లో మన కోటిన్నొక్కడు నవల గురించి సమీక్షను రాసి మాకు పంపించవచ్చు.

మీ సమీక్షను మీరు నలుగురితో పంచుకోవడం మాకు నూటికి నూరు శాతం సమ్మతం. అందుకే మీకు నచ్చిన దగ్గర *మీ సమీక్షను అచ్చువేసుకునే హక్కు మీకుంది*.

అలాగే మీరు మాకు పంపిన సమీక్షలను  నలుగురితో పంచుకునే హక్కు మాకూ కూడా ఉంటుంది.   అనగా, మీరు మాకు పంపిన సమీక్షలను మేము మా సామాజిక మాధ్యమాల్లో, వాట్సప్/టెలిగ్రాం గ్రూపుల్లో లేదా ఆన్లైన్/ఆఫ్లైన్ పత్రికల్లో, పుస్తక రూపంలో ప్రచురించుకునే హక్కు మీకూ, మాకూ, మనందరికీ ఉందన్నమాట.

విజేతలను నిర్ణయించేది,  బహుమతుల మొత్తాన్ని పెంచేది/తగ్గించేది/రద్దుచేసేది.. తుది నిర్ణయం పోటీ నిర్వాహకులదే…

మరింకేం.. ఇంటిల్లిపాదీ ఆనందంగా చదువుకోగలిగిన మన అత్యద్భుత  Comedy &  Motivational నవల ‘కోటిన్నొక్కడు’ను మీరు చదివి ఆనందించడంతో పాటూ, ఎంచక్కా సమీక్ష(లు) కూడా రాసి బహుచక్కటి బహుమతులనూ అందుకోండి.

  • మొదటి బహుమతి: 3000 రూపాయలు (₹ 1500 చొప్పున ఇద్దరికీ)
  • రెండవ బహుమతి: 2000 రూపాయలు (₹  1000 చొప్పున ఇద్దరికీ)
  • మూడవ బహుమతి: 1000 రూపాయలు(₹ 500 చొప్పున ఇద్దరికీ)

(మొత్తం 6గురు విజేతలకు 6000 రూపాయల బహుమతులు)

మీ సమీక్షలు మాకు పంపవలసిన మెయిల్ ఐడి: kotinnokkadu@gmail.com

లేదా మా వాట్సప్ నంబరు *7660875546* కు కూడా మీ సమీక్షలు పంపవచ్చు.

మీ సమీక్షలు మాకు పంపవలసిన చివరి తేదీ: 31.08.2021.

విజేతలను ఉపాధ్యాయ దినోత్సవం (05.09.2021) రోజు ప్రకటించి, అదేరోజు బహుమతులు అందించడం జరుగుతుంది.

(కోటిన్నొక్కడు పుస్తకాలు అమెజాన్‌లో లభ్యం.

https://www.amazon.in/gp/product/9354190510/

అలాగే మా ఈ మెయిల్ & వాట్సప్ నంబరు 7660875546 లో సంప్రదించి కూడా పుస్తకాలు పొందవచ్చును)

మీ చేతన వంశీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here