[dropcap]ఎ[/dropcap]గురుతోంది చూడు
ఆకాశ విను వీధుల గుండా
మన స్వతంత్ర జాతీయ జెండా
ఐక్యతకు చిహ్నంగా
త్యాగానికి ప్రతీకగా
శాంతికి గుర్తుగా
సహనానికి సూచికగా
ఎగురుతోంది చూడు
భారతీయుల మది నిండా
మన మువ్వన్నెల జెండా
స్వేచ్ఛకు చోటుగా
ప్రేమకు మార్గంగా
ధర్మానికి రక్షణగా
దేశ భక్తికి వారధిగా
ఎగురుతోంది చూడు
దేశ సరిహద్దుల గుండా
మన మూడు రంగుల జెండా