ఇది నా కలం-8 : స్వప్న మేకల

0
3

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

స్వప్న మేకల

[dropcap]న[/dropcap]మస్కారం.. నా పేరు స్వప్న మేకల.

కవిత్వమంటే కవి హృదయంలో నుండి జాలు వారే అక్షర ప్రవాహం… ఉవ్వెత్తున ఎగిసి హృదయాలను స్పృశిస్తుంది.. మరెందరో హృదయాలను ప్రశ్నిస్తూ కదిలిస్తుంది…

కలానికి.. కాలానికి నడుమ సాగే పోరాటంలో కవి ఒక వారధి.. ఒక సారధి..

నేను కవిత్వం రాస్తానని ఎప్పుడు అనుకోలేదు… నేను రాసేది కవిత్వమా అనే ప్రశ్న నను వెంటాడుతూనే ఉంది.. ఇది నా అక్షరాల రూపకల్పన అంతే..

నా చిన్నప్పటి నుండి మా నాన్నగారు పేపర్ ఏజెంట్ కావడంతో ఇంట్లో వివిధ రకాల వార పత్రికలు.. మాస పత్రికలు ఉండేవి.. అలా చదవడం వల్లే భావాలు తడిమి అక్షరాలు కదిలాయేమో..

అనుభవాల పుటల్లో వాక్యాలు పరుగులు తీసాయేమో… అలా సామాజిక మాధ్యమాల్లో మొదలు పెట్టి పోటీలకు రాసేదాన్ని… రాస్తున్నాను… అలా మొదలైన సాహిత్య ప్రస్థానంలో వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న నేస్తాలెందరో..

ప్రముఖుల పుస్తకాలు చదవడం చాలా తక్కువే అని చెప్పాలి.. ఇష్టమైన రచన శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం.. విషయ పరిజ్ఞానం మరియు సామాజిక దృక్పథం వుంటే రాయగలం.. ఊహలు ఎపుడు వాస్తవాన్ని కదిలించలేవమో..

ఈనాడు తెలుగు వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనాపై కదనం పోటీల్లో మూడు సార్లు విజేతగా గెలిచాను (ద్వితీయ మరియు రెండు సార్లు తృతీయ). తెలంగాణ సాహితీ ప్రేరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రథమ విజేతగా నిలిచాను.. సూరేపల్లి రాములమ్మ, ఫిలింత్రోపిక్ సొసైటీ మరియు శ్రీశ్రీ కళా వేదిక మరియు వివిధ పోటీల్లో పలు మార్లు విజేతగా నిలిచి నగదు బహుమతులను గెలిచాను..

గెలుపొక ఉత్సాహం.. ఉత్తేజం అంతే…

అలా అనుకుంటూ సాగిపోవడం ఉత్తమం.. ముఖ్యంగా ప్రముఖ వివిధ దిన, వార, మాస పత్రికల్లో సాక్షి, ఆంధ్రజ్యోతి మరియు తెలుగు వెలుగులో నా పేరును నేను రాసిన కవితలని చూసుకోవడం ఎంతో సంతృప్తినిచ్చాయి.. ఒకప్పుడు ఎందరివో అచ్చయిన కవితల్ని అలా చదివేదాన్ని.. ఇపుడు నా అక్షరాలని చదివి ఎందరో వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.. “ఆడపిల్లవని అలుసు చేయకు” నేను రాసిన పాట

యూట్యూబ్‌లో గత సంవత్సరం రిలీజ్ అయ్యింది.. స్పందన తక్కువగా వచ్చినా, నాకు బాగా నచ్చిన పాట..

చివరిగా భావాన్ని ప్రకటించాలి అంటే అంతరంగాన్ని శోధించాలి… అద్భుతాలను సృష్టించాలంటే నీలో నువ్వే కొత్తగా జనించాలి… అప్పుడే కొత్త కవిత్వం పుట్టుకొస్తుంది..

నా కవిత్వం సరళమైన భాషలో సున్నితంగా ఉంటుంది.. కవిత్వమంటే జ్వలించే అక్షరాలు.. ఉవ్వెత్తున ఎగిసి పడాలి..

శ్రీశ్రీ.. తిలక్ గారి కవిత్వంలా

ఎందరికో మార్గదర్శకం కావాలి…

smekala4@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here