కమ్మని ‘చిలక పలుకులు’

1
3

[box type=’note’ fontsize=’16’] డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారు రచించిన ‘చిలక పలుకులు’ అనే బాలల కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

[dropcap]ఇ[/dropcap]ది 27 చిరుకవితల సంకలనం. వీటిని డా. ప్రసాద్ గారు ముఖ్యంగా తన ముద్దుల మనమరాలిని దృష్టిలో ఉంచుకొని రాసారు. సూక్తులు తనవారి శ్రేయస్సు కోరి చెప్పినా, అవి అందరికీ ఎంతో కొంత ఉపయోగపడతాయి. పాఠకులను ఆకర్షించటానికి విషయం మంచిదైతేనే సరిపోదు, చెప్పే విధానం కూడా బాగుండాలి. బాలలకు ఎక్కువ వివరణ లేకుండా అర్థము కావాలి. వారి మనోవికాస స్థాయికి తగినట్లుగా ఉండాలి. మాటలు, సంధులు బాలలకు తెలిసినవి కావాలి. పల్లెనుంచి వచ్చిన మనుమరాలిని ఎగతాళి చేయాలని ఒక తాత ఏమిటి పల్లెటూరి పిల్లా అన్నట్లున్నది.

ఆ అమ్మాయి తాతను ఎలా తిరగేసి కొడుతుందో చూద్దాం. ఎల్దమొస్తవా- పాట. శైలి వంగపండు ప్రసాదరావు పాటకు పేరడీ. ఏం తాతో ఎల్దమొస్తవా? గోదారొడ్డున గ్రామం, అదే దిండి.

అక్కడ పచ్చపచ్చని పొలాలు, కొబ్బరిచెట్లకు కొదవ లేదు. చిత్రమైన చించినాడ వారథి దిండిని కలుపుతుంది.

పాశెర్లపూడి రైలుమార్గమట -దిండిమీదుగా పోవుచున్నదట

చదువు సంధ్యలు సుళువై పోవునట-బజారు బాట దగ్గరవ్వునట

అంతర్వేదికి దగ్గరేనట – లైట్ హౌజ్ కూడా చూడవచ్చునట

ఇంకా గోదారి దాటే పడవ ప్రయాణం, సఖినేటిపల్లి రేవులో సందడి, నరసాపురాన రైలు స్టేషను, హైదరాబాదుకు బండి, టికెట్టు కొని ఎక్కించి తాతను పట్టణానికి పంపేసింది. బస్తీ తాతకు పల్లె పాప పటం మీద స్థలాలు చూపినట్లు చెప్పగలిగింది.

అమ్మకు అమ్మాయి ఎప్పుడూ బొమ్మగానే కనిపిస్తుంది. అయితే సందర్భాన్ని బట్టి బంగారు బొమ్మ, నిర్మల్ బొమ్మ, లక్క పిడత, బాపూ బొమ్మ, అని రకరకాలుగా ముద్దులు చేస్తుంది. కాని బొమ్మను కొనమంటే మాత్రం నువ్వే చక్కని బొమ్మవు- ఇక వేరే బొమ్మలెందుకు అంటుంది అమ్మ.

వాన చినుకులు పడితే పంట పొలాల్లో నాట్లు సాగుతారు. వాన ధారలు రైతులకు అమృతధారలట. కాని ఆ వానలు నగరాలలో కురిస్తే అందాల మేడలు ఇరుకు సంతలై పోతాయట. నగరంలో వానలతో మురుగు కాలువలు, రోడ్ల మీద నదులై పారుతాయట. పల్లపు ప్రాంతాల్లో పాకలను ముంచేస్తుంది. అందుకే వాన అంటే బస్తీ వాసులకు వెన్నులో వణుకు. అని అన్నిదృశ్యాలను రంగుల ఫోటోలు తీసి చూపారు.

రచయిత డా. కె.ఎల్.వి. ప్రసాద్

మొలక, పువ్వులు, ఆరోగ్య భాషణం పేర్లతో సరళమైన కవితలు ఉన్నాయి. ఎలాగూ కోనసీమ పర్యటన కదా? ప్రకృతిని పరవశింపచేసే రకరకాల చెట్లు – కొబ్బరి, తాటి, ముంజెలు,మునగ, మామిడి, తాండ్ర, పనస తొనలు వివరించి, మనిషి నిర్లక్ష్యానికి మాయమైపోతున్న చెట్లను గుర్తు చేస్తుంది ఉనికి కవిత.

వేళ్లు, గుణపాఠం, పుట్టినరోజు మరికొన్ని కవితలు. నారికేళపాకాన్ని కూడా ద్రాక్షపాకం చేసి అందించారు. పిల్లలకు చక్కగా అర్థం కావటానికి వావి వరుసలు తెలిపే కవిత ఉన్నది. పోస్టులో ఉత్తరాలు, వాటికోసం ఎదురు చూడటం,

చిన్నారి చేతులతో చిన్న మొక్కలను పెంచిన అనుభవాన్ని ఆరిందాలాగా చూపుతుంది పాప.

మనుమరాలిని దృష్టిలో ఉంచుకొని రాసిన ఈ కవితల పుస్తకంలో దాదాపు ప్రతి కవితతో పాటు ఒక అందమైన ఫోటో జతపరిచారు. ప్రతి మనుమడిని, మనుమరాలినీ అలరించి, తన్మయంలో ముంచే ఈ పుస్తకాన్ని పిల్లలకు చదువు నేర్పే ఓపిక గల పెద్దలందరూ కొని దాచుకోదగిన విలువైనది.

***

చిలక పలుకులు (బాలల కవితలు)

రచయిత- డా.కె.యల్.వి. ప్రసాద్

పేజీలు: 50, వెల. ₹100/-

ప్రచురణ, ప్రతులకు:

సంరక్ష ప్రచురణలు

డా. కే.యల్.వి. ప్రసాద్, 24-7-322/5, రామకృష్ణ కాలనీ,

హన్మకొండ – 506 004. ఫోన్: 9866252002

*

శివ తాతయ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here