[dropcap]నా[/dropcap]వికుడా! ఓ నావికుడా!
పథ నిర్దేశకుడా
ఆటుపోటులే ఎదురైనా
అలలు ఎగిసిపడుతున్నా
తీరం చేరేదాకా విశ్రమించవు
నీ విధిని మరువవు ॥నావికుడా॥
ఎత్తిన తెరచాప
ఎదురు తిరిగినా
చుక్కాని చూపుకు
చుక్కెదురైనా
సడలదు నీ విశ్వాసం
ఆగదులే నీ పయనం ॥నావికుడా॥